మోడీ తర్వాతి టార్గెట్ అతడేనా?

Update: 2022-08-27 06:36 GMT
బలాన్ని ప్రదర్శించే అవకాశం ఉండి.. దాని సాయంతో అధికారాన్ని చెలాయించటమే కాదు.. తమకు బలంతో  ప్రభుత్వాల్ని పడగొట్టే టాలెంట్ ను ప్రదర్శించే ప్రధానమంత్రులు ఇటీవల కాలంలో పెద్దగా లేరనే చెప్పాలి. ఆ కొరతను తీరుస్తూ.. నరేంద్ర మోడీ చెలరేగిపోతున్నారన్న మాట అంతకంతకూ బలంగా వినిపిస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న తాము.. మెజార్టీ రాష్ట్రాల్లోనూ పవర్లోనే ఉన్నప్పటికీ.. దాన్ని సరిపెట్టుకోకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ తమ సత్తా చాటాలని తపిస్తోంది మోడీ సర్కారు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న చక్కగా సాగుతున్న మహారాష్ట్ర సర్కారుకు దిమ్మ తిరిగేలా షాకివ్వటమే కాదు.. ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న ఉద్ధవ్ ను ఇంటికి పంపేసి.. తమకు విధేయుడిగా సిద్ధం చేసుకున్న ఏకానాధ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టటం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ ఓపక్క ఆ పని చేస్తూనే.. మరోవైపు సోరెన్.. కేజ్రీవాల్ కు చుక్కలు చూపిస్తున్న వైనం తెలిసిందే.

జార్ఖండ్ లోని సోరెన్ సర్కారుకు ఇవాళ.. రేపో నూకలు చెల్లేట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళలోనే ఢిల్లీ లోని కేజ్రీవాల్ సర్కారును సైతం వదలటం లేదు.. వీటన్నింటితో పాటు మరో భారీ టార్గెట్ ను కూడా మోడీ సర్కారు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా వినిపిస్తున్న అంచనాల ప్రకారం తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.అయితే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తమిళనాడులో మోడీషాల మేజిక్ పని చేస్తుందా? తాము టార్గెట్ చేయాలనుకున్నంతనే చేసేయగలరా? మోడీ షా అన్నంతనే తమిళులు మండిపడటం తెలిసిందే.

అలాంటిది స్టాలన్ ను టార్గెట్ చేసి.. ఆయన దగ్గరి పవర్ లాగేసుకోవటం అనుకున్నంత తేలిక కాదని చెబుతున్నారు. ఏమైనా.. బీజేపీయేతర పాలన ఉన్న రాష్ట్రాలకు నిద్ర లేకుండా చేయటంలో దూసుకెళుతున్న మోడీ.. రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ సంచలనాలకు తెర తీసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే బదులివ్వాలి.
Tags:    

Similar News