ప్రజాస్వామిక విధానంలో కోర్టు ఒక అత్యున్నత వ్యవస్థ. మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతుందా లేదా అన్నది విచారించేది న్యాయస్థానమే. ఏ పాలనలో అయినా బాధితుడు తమకు అన్యాయం జరిగింది అని హై కోర్టు తలుపు తడితే వారికి తగిన భరోసా ఇచ్చి న్యాయం చూపేది కోర్టు. అలాంటి కోర్టు ఇచ్చే తీర్పులు కానీ ఆదేశాలు కానీ సామాన్యుడికి అయినా ప్రభుత్వ పాలకులకు అయినా ఒకే విధంగా ఉంటాయి.
వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు కూడా రాజ్యాంగం ప్రకారం మరో కీలక వ్యవస్థ కాబట్టి. కానీ ఏపీలో మాత్రం అసాధారణమైన తీరులో హై కోర్టు ధిక్కార కేసులు నమోదు అవుతున్నాయి. ఏకంగా ఈ ఏడాది వాటి సంఖ్య అక్షరాలా నాలుగు వేలకు చేరుకుంది అన్నది కనుక చూస్తే ఏమిటి ఇది అనిపించకమానదు.
అనేక కేసులలో పిటిషన్లు దాఖలు అయిన సందర్భంలో కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుంది. వాటిని సరిచేసుకోమని చెబుతుంది. అయితే కోర్టు ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం ఎందుకో ఉదాశీనంగా తీసుకుంటోందా అన్న చర్చ వస్తోంది. ఫలితంగా కోర్టు ముందుకు న్యాయం జరగలేదని సదరు పిటిషనర్ మరో మారు వెళ్ళినపుడు కోర్టు సీరియస్ అవుతోంది.
ఈసారి ఆయా విభాగాలకు చెందిన అధికారులను పిలిపించుకుని విచారిస్తోంది. వారికి కూడా గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. గతంలో చూసినా ఇపుడు చూసిన అనేక విషయాల్లో కోర్టు ఆదేశాలు అమలు చేయని అధికార్లు నేరుగా హైకోర్టుకు వెళ్ళి విచారణకు గురి అవుతున్నారు. తప్పు అయింది ఈసారి అలా కాకుండా చూసుకుంటామని చెప్పి వస్తున్నారు. కానీ బయట మాత్రం మామూలుగానే పరిస్థితి ఉంటోంది.
లేటెస్ట్ గా ఈ విషయం మీద హై కోర్టు బాగా సీరియస్ అయింది అని అంటున్నారు. ఉపాధి హామీ పధకానికి సంబంధించి బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని గతంలో పడ్డ పిటిషన్ల మీద విచారించిన కోర్టు అదేశాలను జారీ చేసింది. అయినా కూడా బిల్లులు చెల్లించలేదు. పరిస్థితి అలాగే ఉంది. దాంతో నలుగురు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు.
అయితే ఇలా ఎందుకు జరుగుతోంది, కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. సాధారణంగా ఆర్ధిక సంబంధమైన కేసుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని అంటున్నారు. అయితే ఆ విషయం చెబితే అది సరైన జవాబు కాదు, మరి కొన్ని కేసుల విషయంలో తాము అనుకున్న తీరున ఏమైనా ఆదేశాలు రాకపోతే ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది.
కానీ ఆ విధంగా చేయకుండా ఆదేశాలను అమలు చేయకుండా ఉండడం వల్లనే చివరికీ వి కోర్టు ధిక్కారంగా భావించవలసివస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇక మీదట ప్రభుత్వం కచ్చితంగా కోర్టు ఆదేశాలను అమలు చేస్తుందని, ధిక్కార కేసుల సంఖ్యను పెంచబోమని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకు హామీ ఇచ్చారని చెబుతున్నారు.
చూడాలి మరి అది ఎంతవరకూ అమలు అవుతుందో. ఏది ఏమైనా కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల ఇబ్బంది పడేది కచ్చితంగా ఉన్నత అధికారులే. వారే కోర్టుకు తరచూ వెళ్లాల్సి వస్తోంది. కోర్టు సీరియస్ అయ్యేది కూడా వారి మీదనే. ఇది ఒక విధంగా బ్యూరోక్రసీలోనూ అసంతృప్తికి దారి తీసినా తీయవచ్చు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.