మిగిలిపోయిన ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ ఇంగ్లాండ్ లోనేనా?

Update: 2021-05-10 10:30 GMT
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్   కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో టోర్నమెంట్లో పాటిస్పేట్ చేసేందుకు వచ్చిన వివిధ దేశాల క్రికెటర్లు తమ తమ స్వదేశాలకు బయల్దేరి వెళ్లారు. అయితే ఐపీఎల్ ఆకస్మికంగా ఆగిపోవడంతో బీసీసీఐకి రూ.2500 కోట్ల భారీ నష్టం వాటిల్లనుంది. అయితే ఇంత భారీగా నష్టపోవడానికి బీసీసీఐ  అంత సిద్ధంగా లేదు. విదేశాల్లో అయిన ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించి నష్టాన్ని పూడ్చువాలని ఆలోచిస్తున్నది.

 ఈ నేపథ్యంలో బీసీసీఐ  అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ తో  మాట్లాడారు. ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ గురించి మాట్లాడటం   తొందరపాటే అవుతుందన్నారు. భారత్ లో  ఇప్పటికిప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  అయితే తమ దేశంలో ఐపీఎల్ లో మిగిలిపోయిన మ్యాచ్ లు  నిర్వహించాలని ఇంగ్లాండు ఆహ్వానం పలికిందని  ఆయన చెప్పారు. ఇంగ్లాండ్ కౌంటీల్లో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడానికి వార్విక్ షైర్, సర్రే, మేరేలెబొన్ క్రికెట్ క్లబ్ లు సంసిద్ధత వ్యక్తం చేశాయని గంగూలీ తెలిపారు.

ఈ ఏడాది ఇండియా లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కంటే ఒక నెల ముందుగా, అంటే సెప్టెంబర్ లో మ్యాచ్ లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్ వెల్లడించింది.అయితే బీసీసీఐ ఇంగ్లాండ్  ఇంకా ఓకే చెప్పలేదు. గత ఏడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో యూఏఈలో మ్యాచ్ ల నిర్వహణ  విజయవంతంగా చేపట్టారు. దేశవ్యాప్తంగా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ యూఏఈలో నిర్వహించిన టోర్నమెంట్  సక్సెడ్ అయ్యింది.

అయితే ఈ ఏడాది మిగిలిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లను తిరిగి యూఏఈలో నిర్వహించేందుకు భారత్  సుముఖత వ్యక్తం చేస్తోంది. అయితే కొద్ది రోజులు ఆగితే దేశంలో కరోనా  తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్ నిర్వహించుకోవచ్చు. బీసీసీఐ బోర్డు ఐపీఎల్ నిర్వహణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితులు కాస్త చక్కబడతాఏమోనన్న ఆలోచనలతో  వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.
Tags:    

Similar News