తెలంగాణ సీఎం పోస్టుకు దగ్గరి దారి ఇదేగా?

Update: 2020-02-22 05:31 GMT
మొన్న జగ్గారెడ్డి.. నేడు కోమటిరెడ్డి అదే పాట.. మాకు సీఎం పోస్టు వద్దు బాబాయ్.. పీసీసీ పీఠం ఇవ్వండి చాలు అని.. నిజానికి వీరికి ఇద్దామని అధిష్టానానికి ఆసక్తి లేకున్నా వీరి కోరిక మాత్రం బయటపడింది. అందులో పెద్ద ప్లానే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. తనకు సీఎం పోస్టు, మంత్రుల పోస్టుల వద్దని.. పీసీసీ పీఠం ఇస్తే చాలని.. నాలుగేళ్లలో ఊరువాడ తిరిగి కాంగ్రెస్ ను తెలంగాణలో గద్దెనెక్కిస్తానని శపథం చేశాడు. ఈ మేరకు సోనియా, రాహుల్ ను కలవబోతున్నట్టు ప్రకటించారు.

ఉమ్మడి ఏపీలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని 2004లో  పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి  తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు సీఎం పదవికి దగ్గరి దారి పాదయాత్రే. దాన్నే కోమటిరెడ్డి చేస్తానంటున్నాడు. పాదయాత్ర తో కాంగ్రెస్ కు అధికారం దక్కితే అది చేసిన వారే సీఎం అవుతారు. అంటే కోమటి రెడ్డినే. అందుకే తనకు పీసీసీ పీఠం ఇవ్వండి చాలు అని ఆయన ప్రతిపాదిస్తున్నారు.

పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే ఆయన తప్పు ఎవరూ సీఎం కారు. అందుకే ముందే తనకు సీఎం పోస్టు వద్దు పీసీసీ చీఫ్ కావాలని కాంగ్రెస్ నేతలంతా అధిష్టానాన్ని కోరుతున్నారు.  జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి చూపు పీసీసీ వైపే. సీఎం పోస్టుకు దగ్గరి దారి అయిన పీసీసీ చీఫ్ పోస్టు దక్కితే సీఎం పోస్టు దక్కినట్టే. అందుకే ముందు దానికోసం నేతలంతా వెంపర్లాడుతున్నారని చెప్పవచ్చు.
Tags:    

Similar News