హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ పరిశీలకులపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పరిశీలకులు నిర్ణయం సోనియా గాంధీకే వదిలేశారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో ప్రతిభా సింగ్‌తో పాటు ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సుఖ్వీందర్ సింగ్ సుఖు, మాజీ ప్రతిపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి, సీనియర్ లీడర్ ఆశాకుమారి వంటివారు ఉన్నారు. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. శనివారం సాయంత్రం అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎంను ఎన్నుకోనున్నారు. దీనికోసం పార్టీ పరిశీలకులుగా చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, భూపేంద్రసింగ్ హుడా, రాజీవ్ శుక్లాలు శిమ్లా వెళ్లారు.
శుక్రవారం భూపేశ్ బఘేల్, రాజీవ్ శుక్లాలు బస చేసిన ఓబెరాయ్ హోటల్ వద్ద ప్రతిభా సింగ్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆమెనే సీఎం చేయాలంటూ ఆందోళన చేశారు.
మరోవైపు ప్రతిభ కూడా తాను సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఎన్నికలకు ముందు సోనియా తనకు రాష్ట్ర పార్టీ బాధ్యత అప్పగించారని.. తాను పార్టీని అధికారంలోకి తెచ్చానని.. ఇప్పుడు సీఎంగా కూడా రాష్ట్రాన్ని నడిపిస్తానని అంటున్నారు. వీరభద్రసింగ్ పేరుతో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి... ఇప్పుడాయన కుటుంబాన్ని పక్కన పెడతామంటే ఊరుకునేది లేదంటూ ఆమె తీవ్రంగానే స్పందిస్తున్నారు.
ప్రతిభా సింగ్ ప్రస్తుతం మండీ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండగా తాజా ఎన్నికలలో ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిభను సీఎం చేస్తే ఆమె మండీ ఎంపీగా రాజీనామా చేసి ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలవాలి.
కాగా ప్రతిభా సింగ్ కాకుండా సుఖ్విందర్ సింగ్‌ను సీఎం చేయాలని ఓ వర్గం గట్టిగా పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో సోనియా నిర్ణయంపైనే అక్కడి పదవి ఆధారపడనుంది.
ప్రతిభా సింగ్ సీఎం అయితే, హిమాచల్‌కు తొలి మహిళా సీఎం ఆమే కానున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి యశ్వంత్ సింగ్ పర్మార్ నుంచి తాజా ఎన్నికల వరకు సీఎంగా ఉన్న జైరాం ఠాకూర్ వరకు అందరూ పురుష ముఖ్యమంత్రులే ఉన్నారు.
యశ్వంత్ కుమార్ పర్మార్ 2 సార్లు, ఠాకూర్ రాంలాల్ 2 సార్లు, శాంతారామ్ 2 సార్లు, వీరభద్రసింగ్ 4 సార్లు, ప్రేమ్ కుమార్ ధుమాల్ 2 సార్లు, జైరాం ఠాకూర్ ఒకసారి సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ప్రతిభాసింగ్ సీఎం అయితే హిమాలయపర్వతాల అంచున ఉన్న ఈ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.