గత ఏడాది ఇరాక్ లోని మోసుల్ సిటీని స్వాధీనం చేసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు క్రమంగా తమ ప్రాబల్యాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ... వారికోసం ఫైవ్ స్టార్ హోటల్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు! సుఖానికి అలవాటు పడిన ప్రాణాలు కదా తప్పక అవసరం ఉంటుంది అని పలువురు ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తుంటే... వారి ప్రాభల్యం ఏమేరకు ఉందో ప్రపంచానికి, అమెరికా సంకీర్ణ దళాలకి సంకేతాలు ఇస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు!
వివారాల్లోకెళ్తే... ఇరాక్ లోని మోసుల్ సిటీలో జిహాదీలు తమకోసం, తమవారి కోసం ఓ ప్రత్యేక ఫైవ్‌స్టార్ హోటల్ లాంచ్ చేసుకున్నారు. కట్టారా, ఆక్రమించుకున్నారా అనే విషయాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ... ఈ స్టార్ హోటల్ ను రీసెంట్ గా ప్రారంభించారు! 262 గదులు, బాల్రూమ్లు, స్పెషల్ బాత్ రూం లు, జిమ్, స్విమ్ము వంటి అన్ని రకాల హంగులతో ఈ హోటల్ ఉంది! లోపల హంగులు అలా ఉంటే... ఈ హోటల్ బయట ఆవరణలో చూడ చక్కటి గార్డెన్ తో ఆహ్లాదకరమైన వాతారణానికి సూచికగా ఉంది! ఇది స్టార్ హోటల్ అయినా కూడా మెయింటైన్ చేసేది జీహాద్ కాబట్టి... దానికి గుర్తుగా ఈ హోటల్ పైన ఐఎస్ఐఎస్ నల్లజెండాలను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ లోగో కూడా నల్ల జెండాతోనే రూపొందించారు!
అయితే ఈ హోటల్ ప్రసిద్ధ నినావా ఇంటర్నేషనల్ హోటల్ అని... దీని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకుని వారి సొంత హోటల్ గా మార్చుకున్నారని ఇరాక్ స్థానిక పత్రికలు వెల్లడిస్తున్నాయి! ఉగ్రవాదులు ఆక్రమించుకున్న ఈ హోటల్ ఫ్లోర్స్‌ను పాలిష్ చేయడం, గార్డెనింగ్ పనుల్లో బిజీగా ఉండడం వంటి ఫోటోలను ఇరాక్, సిరియాలలోని వీరి ప్రత్యేక వెబ్ సైట్లు ఇప్పటికే ప్రచురించాయి. మే 1న ప్రారంభమైన హోటల్‌కు సంబంధించిన ఈవెంట్‌ను ప్రమోట్ చేస్తూ... ముస్లింలంతా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చునని దాన్నే ప్రాథమిక అర్హతగా చెబుతూ... ట్విటర్స్ లో ఆహ్వానాలు పలుకుతున్నారు! ఇదే సందర్భంలో రాత్రివేళల్లో బాణాసంచా కాల్చి సంబరాలు కూడా జరుపుకుంటున్నారు! ఇదే సమయంలో సంబరాల్లో ఉన్న ఉగ్రవాదులు... తమను కానీ, తమ ఆధీనంలో ఉన్న ప్రదేశాలను కానీ అమెరికా సైన్యం ఏమీ చేయలేదనే సంకేతాలు ఇస్తున్నారు!