ముంబ‌యి ఎయిర్‌ పోర్ట్ లో ఐసిస్ పిశాచి!

Update: 2017-11-06 04:52 GMT
పురాణాల్లో క‌నిపించే రాక్ష‌సులు చేయ‌ని ఆరాచ‌కాలు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) సొంతం. ప్ర‌పంచానికి షాకుల మీద షాకులు ఇస్తూ.. ఆరాచ‌కాలకు పాల్ప‌డ్డారు. త‌మ అధీనంలోకి వ‌చ్చిన న‌గ‌రాల్ని దారుణంగా వ్య‌వ‌హ‌రించిన వీరి పీడను తొల‌గించేందుకు ఆగ్ర‌రాజ్యాలు క‌లిసి చేసిన ప‌నులు స‌త్ఫ‌లితాలు ఇచ్చాయి.

 ఆ మ‌ధ్య‌లో నిత్యం ఏదో ఒక దుర్మార్గంతో ప్ర‌పంచ మీడియాలో ఐసిస్ దారుణాలు క‌థ‌లు క‌థ‌లుగా ప్ర‌చురిత‌మ‌య్యేవి. వీరి అతిపోక‌డ‌ల‌కు ఆకర్షితులైన ఎంద‌రో అమాయ‌కులు బ‌ల‌య్యారు. ఇస్లామిక్ రాజ్య స్థాప‌న పేరుతో అత్యంత అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించిన వీరితో జ‌త క‌ట్టేందుకు మ‌న దేశం నుంచి ప‌లువురు సిరియా వెళ్ల‌టం తెలిసిందే.

గ‌డిచిన కొద్దికాలంగా ఐసిస్ వార్త‌లు మీడియాలో క‌నిపించ‌టం లేదు. ఐసిస్ పీచ‌మ‌ణిచే ప‌నిలో అమెరికా.. ర‌ష్యా త‌దిత‌ర దేశాలు చేసిన ప్ర‌య‌త్నాల కార‌ణంగా ఐసిస్ అధీనంలోని  న‌గ‌రాలు విముక్తి  అయ్యాయి. దీంతో వీరి దుర్మార్గాల‌కు చెక్ పెట్టిన‌ట్లైంది.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల నుంచి దేశంలో ఐసిస్ క‌ల‌క‌లం మొద‌లైంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా ముంబ‌యి ఎయిర్ పోర్ట్‌ లో ఆదివారం ఉగ్ర‌వాద వ్య‌తిరేక ద‌ళ అధికారులు ఐసిస్ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేవారు. అత‌డ్ని అబు జైద్ గా గుర్తించారు.

దుబాయ్ లో ఉంటూ నార్త్ యూపీకి చెందిన యువ‌కుల‌తో నెట్ వ‌ర్క్ న‌డుపుతున్న‌ట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు.. గ‌తంలో బిజ‌నోర్‌.. యూపీలో అరెస్ట్ అయిన అనుమానితుల‌తో కూడా అబు జైద్ తో ట‌చ్ లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అత‌డ్ని కొద్ది కాలంగా ట్రాక్ చేస్తున్న అధికారులు.. ముంబ‌యి ఎయిర్ పోర్ట్‌ కు వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేసి.. ప్లాన్ లో భాగంగా అక్క‌డ అరెస్ట్ చేశారు.  వారం వ్య‌వ‌ధిలో కేర‌ళ‌లో ఐదుగురు ఐసిస్ అనుమానితుల్ని అరెస్ట్ చేయ‌టం.. తాజాగా ముంబ‌యిలో మ‌రో అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న వైనం క‌ల‌క‌లం రేపుతోంది. సిరియాలో ఐసిస్ అడ్ర‌స్ గ‌ల్లంతైంద‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా దేశంలో రెండు చోట్ల ఐసిస్ అనుమానితులు తెర మీద‌కు రావ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News