ఇండియన్ బోర్డర్ కు ఇజ్రాయెల్ సెక్యూరిటీ

Update: 2016-09-24 07:31 GMT
దేశ సరిహద్దుల్లో భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. పాకిస్థాన్ - చైనా సరిహద్దుల్లో నిత్యం భారత్ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంది. ఒళ్లంతా కళ్లు చేసుకుని మన సైనికులు కాపలా కాస్తున్నా కూడా ఉగ్రవాదులు పాకిస్తాన్ వైపు నుంచి చొరబడుతూనే ఉన్నారు. మరోవైపు చైనా సైనికులు అప్పుడప్పుడు సరిహద్దులు దాటి మన భూభాగంలోకి వచ్చి కవ్విస్తూనే ఉన్నారు. ఇవి చాలవన్నట్లు పఠాన్ కోట్ - యూరీ వంటి ఘటనలు భారత్ కు పరీక్ష పెడుతున్నాయి. దీంతో సరిహద్దు భద్రత అనేది మన పెను సవాల్ గా మారుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి ఇబ్బందే పడుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. సరిహద్దుల వెంబడి శాంతియుత వాతావరణం ఉన్న దేశాలను పక్కనపెడితే నిత్యం రగులుతున్న సరిహద్దు ప్రాంతాలున్న దేశాలు కూడా కొన్ని గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నాయి. మన దేశః రక్షణ పరంగా తక్కువేమీ కాదు. ప్రపంచ దేశాలకు ధీటుగా మంచి రక్షణ వనరులున్నాయి. కానీ.. సరిహద్దు భద్రత విషయంలో మాత్రం కొంత బలహీనంగా ఉన్నాం. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ విషయంలో ముందున్నాయి. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ సహకారంతో మన సరిహద్దులను మరింత భద్రంగా కాపాడుకోవడానికి రెడీ అవుతున్నాం.

దేశ సరిహద్దులను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక విధానాన్ని వినియోగిస్తున్న ఇజ్రాయిల్ - భారత్ కు సరిహద్దు రక్షణపై సలహా - సూచనలను - ఆధునిక పరికరాలను అందించాలని నిర్ణయించింది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇజ్రాయిల్ లో పర్యటించిన వేళ - ఆయనకు పలు రకాల సరిహద్దు రక్షణ మార్గాలు - పరికరాల గురించి - వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు. మొత్తం 14 రకాల పరికరాల గురించి రాజ్ నాథ్ వివరాలు తెలుసుకున్నారు. సాయుధ బలగాలు - నిఘా వర్గాలు వాడుకునేందుకు పనికొచ్చే వీటిని ఇజ్రాయెల్ మనకు సరఫరా చేసే అవకాశాలున్నాయి.  ఇజ్రాయెల్ కూడా సరిహద్దుల్లో సమస్యను ఎదుర్కొంటోందని.. తమలాగే భారత్ కూ సరిహద్దు సమస్య ఉండడంతో తమ అనుభవాలు, పరికరాలను భారత్ తో పంచుకుంటామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇజ్రాయిల్ చుట్టూ లెబనాన్ - సుమేరియా - జోర్డాన్ - గాజా స్ట్రిప్ లు ఉన్నాయి. ఆ దేశాల నుంచి ఇజ్రాయెల్ లోకి వలసలు ఉంటున్నాయి. ఆ వలసలను - సిరియా నుంచి చొరబాట్లను ఆపేందుకు అత్యంత అధునాతన సాంకేతికతను ఇజ్రాయెల్ వాడుతోంది. కాగా కొన్ని రకాల పరికరాలను భారత్ కు సరఫరా చేయడానికి ఇప్పటికే అంగీకారం కుదరగా దానిపై ఇజ్రాయెల్ మన బృందాలకు శిక్షణ కూడా ఇవ్వబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News