ఒక సినిమా నిర్మాణానికి ఖర్చు ఎక్కువ? అంతరిక్షంలోకి ప్రయోగించే రోదసీ ప్రయోగాలకు ఖర్చు ఎక్కవా? అంటే.. కచ్ఛితంగా రోదసి ప్రయోగానికే ఎక్కువ ఖర్చు అవుతుందంటారు. మిగిలిన వారి సంగతేమో కానీ.. ఇస్రో మాత్రం అందుకు పూర్తి భిన్నం. హాలీవుడ్ కు చెందిన చాలా సినిమాల నిర్మాణం కంటే కూడా తక్కువ ఖర్చుకే భారీ ప్రయోగానికి సిద్ధం కావటం విశేషం.
ఈ రోజు అర్థరాత్రి దాటిన తర్వాత.. సోమవారం తెల్లవారుజామున ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న చంద్రయాన్ -2 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. దాదాపు ఐదేళ్ల క్రితం చంద్రయాన్-1 ప్రయోగాన్ని అతి తక్కువ ఖర్చుతో నిర్వహించిన అందరి దృష్టి తన మీద పడేలా చేసిన ఇస్రో.. తాజాగా అదే రికార్డును కంటిన్యూ చేస్తూ.. తన చంద్రయాన్ -2ను సైతం తక్కువ ఖర్చుకే పూర్తి చేయటం గమనార్హం.
చంద్రయాన్ -2 ప్రయోగానికి ఇస్రో చేసిన ఖర్చు రూ.978 కోట్లు. అమెరికన్ డాలర్లలో చెప్పాలంటే 142 మిలియన్ డాలర్లు. ఈ ఖర్చు చాలా హాలీవుడ్ సినిమా నిర్మాణం కంటే తక్కువ కావటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్లుగా పేరున్న చాలా సినిమాల నిర్మాణం కంటే కూడా చంద్రయాన్-2 ప్రయోగం ఖర్చు తక్కువని చెప్పాలి.
అవతార్ సినిమా బడ్జెట్ 478 మిలియన్ డార్లు అయితే.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అవెంజర్స్ ఎండ్ గేమ్‌సినిమా బడ్జెట్ ఏకంగా 356 మిలియన్ డాలర్లు. పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ బడ్జెట్ 444 మిలియన్ డాలర్లు. పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ఎట్ వరల్డ్స్ ఎండ్ మూవీ బడ్జెట్ 348 మిలియన్ డార్లు అయితే.. అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రా న్ బడ్జెట్ 340 మిలియన్ డాలర్లు. ప్రపంచం వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన గ్రావీటీ సినిమా నిర్మాణానికి 10 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు. అంతరిక్ష ప్రయోగం నేపథ్యంలో సాగే ఈ సినిమా కంటే కూడా చంద్రయాన్-2 ప్రయోగం ఖర్చు తక్కువ కావటం విశేషం. ఏమైనా.. తక్కువ ఖర్చుతో సక్సెస్ ఫుల్ ప్రయోగం చేయటంలో ఇస్రో రికార్డును ఎవరూ అధిగమించలేమని చెప్పక తప్పదు.