చంద్రయాన్2 తొలి ఫొటోలు.. వైరల్

Update: 2019-08-04 10:41 GMT
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2  ప్రస్తుతం భూమి కక్ష్యలో తిరుగుతోంది. దీన్ని దశల వారీగా మండిస్తూ చంద్రుడి కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం భూమికి 5000 కి.మీల ఎత్తులో తిరుగుతున్న చంద్రయాన్2 భూమికి సంబంధించిన చిత్రాలను తీసింది. వీటిని ఇస్రో చైర్మన్ కే శివన్ ఆదివారం విడుదల చేశారు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

చంద్రయాన్2 తన ఎల్14 కెమెరా సహాయంతో ఈ స్టిన్నింగ్ భూమి చిత్రాలను తీసింది. చంద్రయాన్ 2 తీసిన తొలి ఫొటోలు ఇవే కావడం విశేషం. శనివారం సాయంత్రం 5.28 నుంచి 5.37 నిమిషాల మధ్య భూమిని ఫొటోలు తీశాయి. అమెరికా ఉపఖండం, పసిఫిక్ మహాసముద్రం ఫొటోలను చంద్రయాన్ 2 తీసింది. చంద్రయాన్2 ఫొటోలు చాలా క్లారిటీగా ఉండడంతో ఈ ప్రయోగం సక్సెస్ అన్న ధీమాలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

ప్రస్తుతం చంద్రయాన్ 2 భూమి నాలుగో స్థిర కక్షలో తిరుగుతోందని ఇస్రో తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం ఇస్రో చంద్రయాన్2లోని ఇంజిన్లను 10 నిమిషాల పాటు మండించి చంద్రుడి సమీప భూ కక్ష్యలోకి పంపించారు.మరోసారి ఆగస్టు 6న ఇంజిన్లు మండించి కక్షను పెంచుతారు. ఆ తర్వాత ఆగస్టు 20న ఇంజిన్లు మండించి చంద్రుడి కక్ష్యలోకి  పంపిస్తారు. చంద్రుడి కక్షలోకి వెళ్లాక దాని సమీపంలోకి వెళ్లి ల్యాండర్ ద్వారా చంద్రుడి ఉపరితలంపైకి చంద్రయాన్ 2 రోవర్ దిగుతుంది. అక్కడ పరిశోధన సాగిస్తుంది. దీంతో చంద్రయాన్ 2 సక్సెస్ అయినట్టే లెక్క.కాగా భూ స్థిర కక్షలో ఉన్న చంద్రయాన్ 2 ప్రయోగాత్మకంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Tags:    

Similar News