ఇస్రో బాహుబ‌లి సూప‌ర్ స‌క్సెస్‌

Update: 2017-06-05 16:51 GMT
ఉత్కంట వీడింది. నూట పాతిక కోట్ల భార‌తీయుల క‌ల‌లు పండాయి. నిన్న‌టి దాయాది మీద విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్న వేళ‌.. మ‌రో పండ‌గ‌లాంటి వార్త‌ను ఇస్రో అందించింది. శ్రీహ‌రికోట నుంచి ఇస్రో ప్ర‌యోగించిన ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన జీఎస్ఎల్ వీ3డీ1 ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ద‌శాబ్దాల ఇస్రో క‌ల‌ల్ని నిజం చేస్తూ.. ప్ర‌యోగం మొద‌లైన 16 నిమిషాల 20 సెక‌న్ల‌లో జీశాట్ 19ని ఇస్రో క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది.

ఈ ఉప‌గ్ర‌హం కోసం ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు 18 సంవ‌త్స‌రాలుగా కృషి చేస్తున్నారు. ఈ ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌టంపై స‌ర్వ‌త్రా సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌టంపై ఇస్రో ఛైర్మ‌న్ కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ.. భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగంలో ఈ రోజు చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

జీఎస్ెల్వీ మార్క్ 3 ప్ర‌యోగం ఇస్రో చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయంగా అభివ‌ర్ణించారు. పూర్తి స్వ‌దేశీ సాంకేతిక‌త‌తో రూపొందించిన ఈ రాకెట్ విజ‌యంతో.. వంద‌ల కోట్ల రూపాయిలు ఆదా కానున్నాయి. తాజా ప్ర‌యోగం మేకిన్ ఇన్ ఇండియా ప్ర‌యోగంగా అభివ‌ర్ణించారు. తాజా విజ‌యంపై మిష‌న్ డైరెక్ట‌ర్ అయ్య‌ప్ప‌న్ మాట్లాడుతూ.. ఇస్రోకు మార్గ‌ద‌ర్శ‌నం ఇచ్చిన ఎంతోమంది గురువుల‌కు తామిచ్చే గురుద‌క్షిణ‌గా పేర్కొన్నారు. తాజా ప్ర‌యోగంతో కేఏ బ్యాండు.. కేయూ బ్యాండ్ ట్రాన్స్ ఫాండ‌ర్లు ఉన్నాయి. దీంతో హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌.. క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి రానున్న‌ట్లుగా చెబుతున్నారు. 4జీ టెక్నాల‌జీ మ‌రింత మెరుప‌డుతుంద‌ని.. పాత త‌రానికి చెందిన ఐదారు క‌మ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హాలు అందించిన సేవ‌ల్ని ఈ ఉప‌గ్ర‌హం ఒక్క‌టే అందిస్తుంద‌ని చెబుతున్నారు. ప‌దేళ్ల పాటు సేవ‌లు అందించ‌నున్న ఈ ఉప గ్ర‌హాన్ని అనుకున్న‌ట్లే స‌క్సెస్ ఫుల్ గా ప్ర‌యోగించ‌టంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News