భార‌త్ తొడ‌గొట్టి ..అమెరికాను పడగొట్టి

Update: 2018-02-17 11:15 GMT
సంచ‌ల‌నాల ప్ర‌యోగాలు చేస్తున్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ)ను ప‌డ‌గొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇస్రో ప్ర‌యోగ చ‌రిత్ర‌లో చంద్ర‌యాన్ -2 అనే మ‌రుపురాని ప్రాజెక్ట్ కు  స‌ర్వం సిద్ధ‌మైంది. ఏప్రిల్ లో రూ.800కోట్లతో ఈ ప్ర‌యోగం ప్రారంభం కానున్న ఈ ప్ర‌యోగంలో విజ‌యం సాధిస్తే అమెరికా కంటే మ‌నమే తోపులం అని నిరూపించుకోవ‌చ్చ‌ని కేంద్ర మంత్రి(అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ ఛార్జి మంత్రి) జితేంద్ర సింగ్ చెప్పారు.

2008లో తొలి చంద్ర‌యాన్ -1 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. ఈ ప్ర‌యోగం ద్వారా స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ విజ‌యం నింపిన ఉత్సాహంతో చంద్ర‌యాన్-2కి ఇస్రో సిద్ధ‌మైంది. ఈ ప్ర‌యోగంలో ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా - ర‌ష్యా - చైనాలు చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ ల‌ను ల్యాండ్ చేసి విజ‌యం సాధించాయి. ఇప్పుడు అదే ప్ర‌యోగాన్ని భార‌త్ చేపట్ట‌నుంది. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైతే సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌వ‌చ్చ‌ని జితేంద్ర ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 ఈ ప్ర‌యోగం చంద్రునిపై ఖ‌నిజ వ‌న‌రులు - మూల‌కాల్ని - మాన‌వ జాతి మ‌నుగ‌డ‌కు సాధ్యం అవుతుందా అనే విష‌యాల‌పై జ‌ర‌గ‌నుంది.  

  నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) కంటే ఇస్రో 20 రేట్లు తక్కువ బడ్జెట్ ప్రారంభం కానున్న ఈ ప్ర‌యోగాన్ని తొలత  తమిళనాడు మహేంద్రగిరి ఇస్రో ఇందన కేంద్రంలో పరీక్షిస్తున్నారు. ఈ ప‌రీక్షల అనంత‌రం చంద్రయాన్-2 వ్యోమనౌక - ల్యాండర్ - రోవర్.. ప్రధాన -ఉప వ్యవస్థల అనుసంధానం చేస్తారు. అనంత‌రం 100మీట‌ర్ల ఎత్తులో చంద్ర‌మండ‌లంలోని గురుత్వాక‌ర్ష‌ణ వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తారు.ఇలా చేయ‌డం ద్వారా  ఆ   చంద్ర‌యాన్ -2 రోవ‌ర్ చంద్రునిపై కుప్ప‌కూలకుండా ఉంటుంది. అయితే గురుత్వాక‌ర్ష‌ణ అనంత‌రం అనంత‌రం 500కిలోల బ‌రువున్న   వ్యోమ‌నౌక‌ను 100మీట‌ర్ల ఎత్తునుంచి కింద జార విడుస్తారు.  ఆలా జార విడిచిన‌ప్పుడు రోవ‌ర్ నింగిని చీల్చుకుంటూ విజ‌య‌ద‌ర‌హాసంతో అనుకున్న క‌క్ష్య‌లోకి వెళుతుంది. దీంతో ప్ర‌యోగానికి ఒక సార్ధ‌క‌త ల‌భిస్తుంది.  

Tags:    

Similar News