అంతరిక్ష ప్రయోగాలకు పెట్టింది పేరు ఇస్రో. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని అందించేలా అంతరిక్ష ప్రయోగాలు జరిపే ఇస్రో.. ఏ ప్రయోగం చేసినా సక్సెస్ పక్కా అన్న పేరు ఇప్పుడో నమ్మకంగా మారింది. తాజాగా ఏపీలోని శ్రీహరికోట నుంచి పీఎస్ ఎల్ వీ-సి39 వాహన నౌకలో ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని పంపనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయోగాన్ని ఈ రోజు (బుధవారం) రాత్రి 7 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు.
2013 జులైలో పీఎస్ ఎల్ వీ ద్వారా నావిగేషన్ వ్యవస్థ కోసం ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1ఎ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. అయితే.. అందులోని క్లాక్ (గడియారం)లో సాంకేతిక లోపం తలెత్తి పని చేయటం మానేసింది. దీంతో.. నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఈ ఉపగ్రహం పని చేయటం లేదు. దీంతో.. దీని స్థానంలో తాజాగా మరో ఉపగ్రహాన్ని (ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1హెచ్)ను అంతరిక్షంలోకి పంపుతున్నారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మధ్యాహ్నం 1.59 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి.. సాయంత్రం 6.59 గంటలకు ప్రయోగం జరపాలని నిర్ణయించారు అయితే.. ఈ సమయంలో అంతరిక్ష వ్యర్థాలు ప్రయోగానికి అడ్డంకిగా మారతాయన్న అంచనాకు వచ్చిన శాస్త్రవేత్తలు ప్రయోగ సమయాన్ని ఒక నిమిషం ఆలస్యంగా చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. కౌంట్ డౌన్ సమయాన్ని మర్చారు. షెడ్యూల్ ప్రకారం 1.59 గంటలకు స్టార్ట్ కావాల్సిన కౌంట్ డౌన్ ను మధ్యాహ్నం 2 గంటలకు మార్చారు. సునిశిత పరిశీలన.. పక్కాగా ఉండే ముందస్తు కసరత్తుతోనే ఈ అంశాల్ని గుర్తించారని చెబుతున్నారు. ఇలాంటివే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయటంలో కీలకంగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మామూలు విషయాల్లో నిమిషాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోకున్నా.. కీలక ప్రయోగాలకు అదెంత విలువైన టైమన్నది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పక తప్పదు.