తెలంగాణలో అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్షం బీజేపీలమధ్య మరో వివాదం తెరమీదికి వచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు సీఎం కేసీఆర్ అనుమతి నిరాకరించడంతో ఇప్పుడు బీజేపీ నాయకులు సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో సోమవారం నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే, ప్రభుత్వ ఆదేశాల మేరకు.. అంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. ఇది వివాదానికి దారితీసింది.
ఏం జరిగిందంటే..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను విడతల వారీగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదో విడత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్(ఇప్పుడు జిల్లా)లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఇది, సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ సోయం బాపూరావు ఇటీవల పోలీసులను అనుమతి కోరారు. అయితే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.
అనుమతి ఇచ్చి ఉంటే.. బాసరలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి. వీరేందర్ గౌడ్ వెల్లడించారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు సాగే పాదయాత్రలో నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి మీదగా సాగి.. కరీంనగర్‌లో ముగింపు సభ ఉంటుందని తెలిపారు.
కేసీఆర్ కుటుంబ అవినీతి నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇప్పటి వరకు 4 విడతలుగా పాదయాత్ర చేసి 13ఎంపీ, 48అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. 21జిల్లాల్లో 1178కి.మీ సాగినట్లు వీరేందర్ గౌడ్ వివరించారు.
పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని సంకేతాలు వెలువడ్డాయని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం.. రాజకీయ కుట్రలో భాగమేనని చెప్పారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామని చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.