జ‌గ‌న్..ఓ బిజినెస్ ప‌ర్స‌నాలిటీ... విశాఖ ఉక్కుపై అదే ముద్ర‌!!

Update: 2021-02-07 08:30 GMT
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుడు మాత్ర‌మే కాదు.. దీనిక‌న్నా ముందు ఆయ న ఓ బిజినెస్ ప‌ర్స‌న్‌. కంపెనీల‌ను ఎలా ర‌న్ చేయాలో.. ఎలాంటి పెట్టుబ‌డులు ఎక్క‌డ ఎలా పెట్టాలో వంటి అనేక కీల‌క విష‌యాలు తెలిసిన‌.. క‌ష్టాల్లోనూ సంస్థ‌ల‌ను ఎలా ర‌న్ చేయాలో తెలిసిన ప‌క్కా బిజినెస్ మ్యాన్‌. కొన్నేళ్ల కింద‌ట అంటే.. 2012-14 మ‌ధ్య స‌మ‌యంలో జ‌గ‌న్ వ్యాపారాల‌ను మూయించేందుకు కొన్ని వ‌ర్గాలు ప్ర‌య‌త్నించాయి. అనేక రూపాల్లో ఆయా సంస్థ‌ల‌పై దాడులు చేయించి మూసివేయించే ప్ర‌య‌త్నాలు సాగాయి.

అయితే.. జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో వాటిని నిల‌బెట్టి.. ఇప్పుడు లాభాల ప‌ట్టించారు. ముఖ్యంగా ఈ వ‌రుస‌లో భార‌తీ సిమెంట్‌, సాక్షి మీడియా.. వంటివి ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ సీఎం. అయినా.. అవ‌స‌రం వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌లో ఉన్న బిజినెస్ ప‌ర్స‌నాలిటీ విజృంభించింది. ప్ర‌స్తుతం విశాఖ ఉక్కు క‌ర్మాగారం విష‌యం పెద్ద ఎత్తున వివాదం అయింది. దీనిని విక్ర‌యించేందుకు కేంద్ర ప్ర‌బుత్వం సిద్ధ‌మైంది.అయితే.. ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటు వెనుక అనేక మంది ప్రాణ‌త్యాగం ఉంద‌ని.. పెద్ద ఎత్తున ఉద్య‌మాల‌కు మ‌ళ్లీ రెడీ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వివిధ పార్టీలు కూడా విశాఖ ఉక్కు విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ.. డిమాండ్లు చేస్తున్నాయి.అయితే.. ఈ ఒత్తిడి ఎలా తీసుకురావాలి?  అనే విష‌యంలో మాత్రం ఎవ‌రూ గైడ్ చేయ‌లేదు. ఎంత‌సేపూ.. రాజ‌కీయంగానే విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్ప‌.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాత్రం చూపించిన దాఖ‌లా లేదు. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం అనూహ్యంగా స్పందించారు. స‌మ‌స్య‌కు ప‌రిష్కారాల‌ను చూపించారు. విశాఖ  ఉక్కును నిల‌బెట్టుకునేందుకు, ప్ర‌స్తుతం వ‌స్తున్న న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఆయ‌న త‌న బిజినెస్ మైండ్‌తో ఆలోచించి.. కేంద్రానికి దిశానిర్దేశం చేశారు.

కేంద్రానికి ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌లో ముఖ్యాంశాలు చూస్తే.. మేధావుల‌ను సైతం.. నివ్వెర‌పోయేలా చేస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఉన్న వారు విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతార‌ని.. కానీ..జ‌గ‌న్ మాత్రం స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించ‌డం.. గ్రేట్ అని అంటున్నారు.

సీఎం చేసిన కీల‌క సూచ‌న‌లు..

+  విశాఖ స్టీల్‌ను లాభాల బాట పట్టించేందుకు కేంద్ర ఉక్కుశాఖతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
+ 2020 డిసెంబరులో రూ.200 కోట్ల లాభం వచ్చింది. మరో రెండేళ్లపాటు చే యూతనందిస్తే ఆర్థిక సుస్థిరత సాధిస్తుంది.
+ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా ఇనుప ఖనిజ గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ప్లాంటు విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై వడ్డీ ఎక్కువగా ఉండడం కూడా పరిశ్రమకు భారంగా మారింది.
+ సొంత గనులు లేకపోవడం వల్ల ఎన్ఎండీసీకి చెందిన బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని కొనుగోలు చేస్తోంది. దీనివల్ల టన్నుకు అదనంగా రూ. 3,472 చొప్పున భారం పడుతోంది.  
+ ప్లాంటుకున్న రూ.22,000 కోట్ల రుణంపై అత్యధికంగా 14% వడ్డీ రేటు అమలవుతోందని, దీన్ని తప్పించేందుకు మొత్తం రుణా న్ని ఈక్విటీ రూపంలోకి మార్చి స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేసే అవకాశాన్ని పరిశీలించాలి.
+ దీనివల్ల వడ్డీ భారం తొలగిపోతుంది. ప్రజలకు వాటాలను అందుబాటులోకి తేవడం ద్వారా బ్యాంకుల పాత్రను తప్పించవచ్చు. ప్రస్తుతం ప్లాంటు అప్పులపై ఉన్న అధికశాతం వడ్డీని తగ్గించాలి.
Tags:    

Similar News