ఎక్క‌డైనా రాజ‌కీయం చేయొచ్చు.. జ‌గన్‌కే లాభం..!

Update: 2022-12-27 02:30 GMT
ఈ దేశంలో ఎవ‌రు ఎక్క‌డైనా రాజ‌కీయాలు చేయొచ్చు. దీనికి ఎవ‌రూ అడ్డు చెప్ప‌రు. దీనిని ఎవ‌రూ కాద‌న రు. కానీ, అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ‌లో రాజ‌కీయం చేయ‌డాన్ని.. ఏపీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శించారు. దీనిని త‌ప్పుప‌ట్టిన‌ట్టే మాట్లాడారు. నాకు.. ఒక్క‌టే రాష్ట్రం. ఒక్క‌టే రాజ‌కీయం. నాకు బాబులాగా వేరే రాష్ట్రం లేదు.. అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

అయితే.. ఇది రాజ‌కీయ కోణంలో చూసిన‌ప్పుడు.. చంద్ర‌బాబు వంటి మేధావి.. ఎక్క‌డైనా రాజ‌కీయాలు చేయొచ్చ‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతారు. ఇది స‌హ‌జం కూడా. ప్ర‌జాస్వామ్య దేశంలో ఏదైనా సాధ్య‌మే. కానీ, ఇటా చంద్ర‌బాబు ఎక్కడైనా రాజ‌కీయం చేయ‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం? అనేది చూస్తే.. ఇప్ప‌టికిప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్‌కే ప్ర‌యోజ‌నం అంటున్నారు.

ఎలాగంటే.. జ‌గ‌న్ ఏపీపైనే కాన్స‌న్‌ట్రేట్ చేయ‌డం వ‌ల్ల‌.. పొరుగు రాష్ట్రాల‌కు ఆయ‌న శ‌తృవుకాలేరు. అంతేకాదు.. ఇప్ప‌టికిప్పుడు ఏపీ ప్ర‌యోజ‌నాల కోస‌మే పోరాడుతున్న నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు తెచ్చుకునేందుకు ప్ర‌యోజ‌నం ఉంటుంది. అంతేకాదు.. రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తున్నార‌నే వాద‌న కూడా లేకుండా పోతుంది. ఏపీ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఉన్న‌ట్టు చెప్పుకోవ‌చ్చు.

ఇక‌, టీడీపీ విష‌యానికి వస్తే.. మ‌రింత మంది శ‌త్రువుల‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. పోనీ..తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి ఉంటుందా? అనేది చూస్తే.. క‌ష్ట‌మే. అయితే.. ఓ ఐదారుగురు ఎమ్మెల్యేల‌ను సంపాయించుకునేప‌రిస్థితి ఉంటుంది. దీనికిగాను.. చంద్ర‌బాబు అనేక శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను ఇక్క‌డ ధార పోయ‌డంతోపాటు.. ప్ర‌త్య్‌క్ష ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న పోగొట్టుకునే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News