ఏపీ అసెంబ్లీలో గురువారం పోలవరం ప్రాజెక్టుపై వాదోపవాదాలు జరిగాయి. పాలక టీడీపీ నేత - సీఎం చంద్రబాబు విపక్షాలపై మండిపడగా.. విపక్షాలు కూడా స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలవరానికి పూర్తి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలని చంద్రబాబు కోరారు. ఒక్కపూట అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారని, మరి కడుపునిండా అన్నం పెట్టే పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకుంటారా అని వైసిపిపై చంద్రబాబు ఊగిపోయారు. ప్రతిపక్షాలు అడ్డదిడ్డంగా మాట్లాడటం దారుణం అన్నారు. పోలవరం ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని సీఎం అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది 2,533 కోట్ల రూపాయలు మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వం ఖర్చుపెట్టింది 2,924 కోట్ల రూపాయలని అన్నారు. అయితే, రెండున్నరేళ్లలో తాము ఖర్చుపెట్టింది. రూ. 3500 కోట్లని సమాధానం ఇచ్చారు. వైఎస్ ఆర్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఖర్చుపెట్టారని జగన్ చెప్పడం అవాస్తవమని చంద్రబాబు కొట్టిపారేశారు.
అంతకుముందు జగన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలతో పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 110 కోట్ల పనులు మాత్రమే చేసి, తర్వాత బ్లాకౌట్ అయ్యిందని, అలాంటి కంపెనీని పక్కన పెట్టాల్సింది పోయి వాళ్లతోనే పనులు చేయిస్తూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడితో సహా అందరూ నామినేషన్ పద్ధతి మీద సబ్ కాంట్రాక్టుల పేరుతో ఇష్టం వచ్చిన వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పనులు ఇస్తూ, ఖర్చును పెంచి చూపిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు ఇంతకుముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పట్లో ఒక్క రూపాయి కూడా పోలవరానికి ఖర్చుపెట్టలేదని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చయిన 8800 కోట్లలో 5540 కోట్లు చంద్రబాబు సీఎం కాకముందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖర్చయిందని తెలిపారు. ఆరోజు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం 172 కిలోమీటర్ల కుడికాల్వలో 144 కిలోమీటర్లు, ఎడమకాలువ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు పూర్తిచేసిందని... చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసి మూడేళ్లవుతున్నా ఆయన 3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/