ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆయన పర్యటన రద్దైంది. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ కూడా రద్దైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. డీఎంకే అధినేత స్టాలిన్.. ఇతర ముఖ్యులను వెంట పెట్టుకొని తాడేపల్లిలోని తన నివాసానికి తీసుకెళ్లారు జగన్.
అక్కడ వారందరికి విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన రద్దైనట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ప్రమాణస్వీకారోత్సవం పూర్తి అయిన అనంతరం.. జగన్.. కేసీఆర్ లు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే.. తాజాగా జగన్ తన ఢిల్లీ టూర్ ను కేన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. జగన్.. కేసీఆర్ టూర్ కేన్సిల్ కావటానికి విందు కార్యక్రమం కారణం కాదని తెలుస్తోంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల ఫ్లైట్ షెడ్యూల్ ముందుగా నిర్ణయించకపోవటం.. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున అతిధులు ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో.. వీరి విమానానికి అనుమతులు ఇవ్వటం ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తోంది.
ముందుగా షెడ్యూల్ లేని విమానాలకు ల్యాండింగ్ సౌకర్యం కష్టంగా మారటంతో.. వీరి విమానాన్ని డీజీసీఏ అనుమతులు రద్దు చేసింది. ఇప్పటికే ప్రత్యేక విమానాల రద్దీ ఢిల్లీకి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ముందస్తు అనుమతి తీసుకోని విమానాలకు అనుమతిని నిరాకరిస్తున్నారు. ఈ కారణంతోనే జగన్.. కేసీఆర్ ఢిల్లీ టూర్ రద్దు అయినట్లుగా చెప్పాలి.