వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తాజాగా సీబీఐ కోర్టులో సాగిన విచారణలో తుదితీర్పును ఆగస్టు 25న వెల్లడిస్తామని.. న్యాయమూర్తి వెల్లడించారు. ఇప్పటికే దీనిపై మూడు పక్షాల వాదనలు కూడా పూర్తయ్యాయి. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని.. సో.. ఆయన బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో నిందితులకు కీలక పోస్టులు అప్పగించారని.. పలువురు నేతలకు పదవులు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ అసమ్మతి ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..
అప్పటి నుంచి జగన్ బెయిల్‌రద్దవుతుందా? అయితే.. ఏం జరుగుతుంది? తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, రఘురామ వేసిన పిటిషన్‌పై ఇటు సీఎం జగన్ తరఫున వాదనలు కూడా పూర్తయ్యాయి. రఘురామ కేవలం రాజకీయ పూరిత దురుద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని.. ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో చేతులు కలిపి.. ప్రభుత్వా న్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని.. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ వేశారని.. దీనిని కొట్టివేయాలని.. అసలు దీనికి వాలిడిటీనే లేదని.. వైసీపీ అధినేత జగన్ తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నివించారు. ఇక, ఇదే పిటిషన్‌పై సీబీఐ కూడా తన వాదనలు వినిపించింది. అయితే.. కోర్టు నిర్ణయం మేరకు దీనిని పరిష్కరించవచ్చని తెలిపింది.
దీంతో ఈ కేసు విచారణ.. ఆగస్టు 25కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ విషయం మరింత ఉత్కంఠకుదారితీసింది. ఆగస్టు 25న సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది. జగన్ సీఎంగా ఉన్నందున సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే.. ఆయనకు బెయిల్ రద్దు అవడం ఖాయం. అలా కాకుండా ఈ పిటిషన్ కేవలం రాజకీయ కోణంలోనే దాఖలు చేశారన్న జగన్ వాదనలు పరిగణనలోకి తీసుకుంటే.. జగన్ సేఫ్. రెండేది పక్కన పెడితే.. రఘురామ పిటిషన్ మేరకు బెయిల్ రద్దయితే.. తదుపరి ఏం జరుగుతుంది? అనేది కీలకంగా మారింది. అయితే.. దీనిపై అనేక విశ్లేషణలు అప్పుడే హల్‌చల్ చేస్తున్నాయి.
ఇతర పక్షాల మాట ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం.. తమ నాయకుడికి ఏమీ కాదని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు.. సీబీఐ కోర్టు బెయిల్ రద్దు చేసినా.. దీనిని హైకోర్టులో సవాల్ చేసేందుకు ఎలానూ సమయం ఉంటుందని.. ఎందుకం టే.. తమ నాయకుడు వీవీఐపీ జాబితాలో ఉన్నారని అంటున్నారు. ఇక, హైకోర్టులో ఈ కేసు తేలే సరికి సమయం పడుతుంద ని.. ఒక వేళ అక్కడ కూడా.. జగన్‌కు ప్రతికూలంగా తీర్పు వచ్చినా.. సుప్రీం కోర్టుకు వెళ్తారని.. ఇదంతా తేలే సరికి ఎన్నికల సమయం వచ్చేస్తుందని.. అంటున్నారు.
సో.. ఇప్పటికిప్పుడు జగన్‌కు వచ్చిన ముప్పు ఏమీలేదని.. అయినా.. రఘురామ చేసింది ఆరోపణలేనని.. ఆయన చెప్పినట్టు సాక్షులను ప్రభావితం చేసిన అంశాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన ఇవ్వలేక పోయారనేది వైసీపీ నేతల వాదన. ప్రస్తుతం ఇదే విషయంపై వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలను వైరల్ చేస్తున్నారు. `జగన్ సేఫ్-బెయిల్ రద్దుకాదు` అనే నినాదాలను భారీ ఎత్తున పోస్టు చేయిస్తున్నారు. ఇదంతా చూస్తే.. వైసీపీ కార్యకర్తలు, నేతల్లో నెలకొన్న నైరాశ్యాన్ని , ఆందోళనను తగ్గించేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు పరిశీలకులు.