అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి.. అక్కడి టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొని కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షకు కూడా ప్రయత్నించారు. అటు టీడీపీ.. ఇటు వైసీపీల ఫైట్ తో తాడిపత్రిలో ఇప్పుడు 144 సెక్షన్ అమలవుతోంది.
ఈ క్రమంలోనే అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోందంటూ ఈ వివాదంపై సీఎం జగన్ దృష్టి సారించినట్టు తెలిసింది. వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సీఎం జగన్ ఆఫీసు నుంచి కాల్ వచ్చినట్టు సమాచారం. ‘సీఎం గారు మిమ్మల్ని క్యాంప్ కార్యాలయానికి రమ్మంటున్నారని.. ఇవాళే రావాలని’ ఫోన్ లో కోరినట్టు తెలిసింది.
దీంతో పెద్దారెడ్డి వెంటనే నియోజకవర్గంలో పెట్టుకున్న కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకొని హుటాహుటిన కొంత మంది ప్రధాన అనుచరులతో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.
సీఎం జగన్ తన వద్దకు వచ్చిన పెద్దారెడ్డికి ఏం హితబోధ చేస్తారు? వరుస ఘటనలపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? గమ్మున ఊరుకోమని అంటారా? అనే దానిపై వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.