కలైంగర్ కరుణానిధి అస్తమించడంతో తమిళ రాజకీయాలలో మరో శకం ముగిసింది. దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించిన రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతితో తమిళనాడులో మరో రాజకీయ దిగ్గజం నేల రాలింది. తమిళనాట 5 దశాబ్దాలపాటు చక్రం తిప్పిన కరుణ...ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కరుణానిధి మృతిపట్ల పలువురు రాజకీయ - సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, భారత ప్రధాని మోదీ....కరుణ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని మోదీ అన్నారు. భారత దేశం.... ముఖ్యంగా తమిళనాడు ఆయనను కోల్పోయిందని....కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ ట్వీట్ చేశారు. కరుణ మృతిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త యావత్ దేశానికే తీరని లోటని నరసింహన్ అన్నారు.
కరుణానిధి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు - తెలంగాణ సీఎం కేసీఆర్ - వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి - జనసేన అధినేత పవన్ కల్యాణ్ - లోకేష్ వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం వ్యక్తం చేశారు. కరుణ మృతిపట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణ కుటుంబసభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని డీఎంకేని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని జగన్ కొనియాడారు. అధికారంతో పనిలేకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి కరుణానిధి అని అన్నారు. ఈ దేశం ఓ రాజకీయ యోధుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. సాహిత్యం - సినీ - పత్రికా - రాజకీయ రంగాల్లో కరుణానిధి విశేష కృషి చేశారన్నారు. నిరుపేదలు బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పరితపించిన నేత అని అన్నారు.ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి కరుణానిధి అని, దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు.