జ‌గ‌న్ డాట‌ర్‌... గ్రేట్ ఎకాన‌మిస్టే!

Update: 2017-09-08 12:14 GMT
ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత - వైసీపీ అధినేత  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఈ విష‌యంలో నిజంగానే అప‌రిమిత సంతోషాన్నిచ్చింద‌నే చెప్పాలి. ఎందుకంటే... తాను రాజ‌కీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న కూతురు ప్ర‌పంచంలో ప్ర‌ఖ్యాత విద్యాల‌యంలో సీటు సాధించిందంటే ఎవ‌రికైనా ఎందుకు సంతోషం ఉండ‌దు చెప్పండి. అది కూడా త‌న ప‌లుకుబ‌డిని ఏమాత్రం వాడుకోకుండానే... కూతురు లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో సీటు సాధించిందంటే జ‌గ‌న్ నిజంగానే సంతోషంలో మునిగిపోయి ఉంటారు. ఓ వైపు నిత్యం పార్టీ వ్య‌వ‌హారాలు... మ‌రోవైపు అదికార పార్టీకి ఎదురురొడ్డి పోరాడుతున్న తీరుతో జ‌గ‌న్ నిత్యం బిజీబిజీగానే ఉంటున్నారు. ఏమాత్రం తీరిన లేని షెడ్యూల్‌ తో జ‌గ‌న్ త‌న పిల్ల‌ల కోసం కేటాయిస్తున్న స‌మ‌యం చాలా త‌క్కువ‌నే చెప్పాలి.

తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... జ‌గ‌న్ కూతుళ్లు మాత్రం చ‌దువులో త‌మ‌దైన శైలిలో రాణిస్తూ... తండ్రిని ఆనంద డోలిక‌ల్లో ముంచేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... జ‌గ‌న్‌ - భార‌తిల‌కు ఇద్ద‌రు కూతుళ్లున్న విష‌యం తెలిసిందే. పెద్ద కుమార్తె పేరు వ‌ర్షా రెడ్డి కాగా... చిన్న కూతురు పేరు హ‌ర్షా రెడ్డి. జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా కూడా జ‌నం ఆయ‌న‌కు హార‌తి ప‌డుతున్న వైనం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇంత‌టి ప్ర‌జాద‌ర‌ణ ఉన్న జ‌గ‌న్ కూతుళ్లుగా వ‌ర్ష, హ‌ర్ష ఏనాడూ బ‌య‌ట‌కు వ‌చ్చిందే లేదు. కేవ‌లం కుటుంబ కార్య‌క్ర‌మాలు మిన‌హా మిగిలిన ఏ ఒక్క కార్య‌క్ర‌మంలోనూ వారిద్ద‌రూ అస‌లు క‌న‌పించిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. అడ‌పా ద‌డ‌పా జ‌గ‌న్ స‌తీమ‌ణిగా వైఎస్ భార‌తీ రెడ్డి బ‌య‌ట క‌నిపిస్తున్నా... త‌న కూతుళ్ల‌ను మాత్రం ఆమె చ‌దువుకే అంకితం చేసేశారు. త‌ల్లిదండ్రుల మ‌న‌సు గుర్తెరిగిన వారిలా వ‌ర్ష‌, హ‌ర్ష కూడా చ‌దువులో మెరుగ్గా రాణిస్తున్నారు.

హ‌ర్షా రెడ్డి ఇంకా స్కూల్ లెవెల్ దాట‌లేదు గానీ... వ‌ర్షా రెడ్డి మాత్రం ఇంట‌ర్ స‌మాన స్థాయిని బ్ర‌హ్మాండ‌మైన ప‌ర్జంటేజీతో పూర్తి చేసింది. అంతేనా... విద్యాబుద్ధుల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఏ కొద్ది మందికో సాధ్యం కాని ఫీట్‌ను ఆమె సాధించేసింది. ఆర్థిక శాస్త్రంలో ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క విశ్వ‌విద్యాల‌యంగా గుర్తింపు పొందిన లండ‌న్ స్కూల్ ఎక‌నామిక్స్‌లో ఆమె సీటు సాధించింది. ఇంట‌ర్ స్ఠాయిలో 99 శాతం మార్కులు వ‌స్తే గానీ.. ఆ వ‌ర్సిటీ ప్ర‌వేశ ప‌రీక్ష కూడా రాయ‌డానికి సాధ్యం కాదు. ఒక‌వేళ ఇంట‌ర్‌లో ఆ స్థాయి మార్కులు సాధించి ప్ర‌వేశ ప‌రీక్ష రాసినా... ప్ర‌పంచంలోని అన్ని దేశాల నుంచి వ‌చ్చే విద్యార్థుల‌తో పోటీ ప‌డి మ‌రీ సీటు సాధించ‌డమంటే అదేమంత చిన్న విష‌యం కాదు.

అయితే ఇంట‌ర్‌లో అత్య‌ధిక శాతం మార్కులు సాధించిన వ‌ర్షా రెడ్డి... లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లోనూ స‌త్తా చాటింది. స‌త్తా చాటడ‌మే కాకుండా ఏకంగా సీటు కూడా కొట్టేసింది. ఇక ఆ వ‌ర్సిటీలో ఆమె అడ్మిష‌న్ పొంద‌డ‌మే త‌రువాయిగా మారింది. ఈ క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఈ నెల 11న లండ‌న్ బ‌య‌లుదేరుతున్నారు. త‌న ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప‌జేసిన కూతురును లండ‌న్ స్కూల్ ఆప్ ఎక‌నామిక్స్‌లో చేర్పించేందుకే జ‌గ‌న్ దంప‌తులు లండ‌న్ వెళుతున్నార‌ట‌. దాదాపుగా వారం పాటు అక్క‌డే ఉండ‌నున్న జ‌గ‌న్‌... కూతురును ప్రతిష్ఠాత్మ‌క విశ్వ‌విద్యాల‌యంలో చేర్పించి ఈ నెల 18న తిరిగి వ‌స్తార‌ట‌.

ఇంట‌ర్ స్థాయిలో త‌న‌దైన శైలిలో ప్ర‌తిభ చాటిన వ‌ర్షా రెడ్డి... లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో త‌న గ్రాడ్యుయేష‌న్‌ను పూర్తి చేసి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ఆర్థిక‌వేత్త‌గా తిరిగి వ‌స్తార‌న్న విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ముందుగా వ్యాపార‌వేత్త‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన వైఎస్ జ‌గ‌న్‌... ఆ త‌ర్వాత తండ్రి వార‌స‌త్వంగా రాజకీయాల్లోకి వ‌చ్చేశారు. అయితే ఆయ‌న ప్రారంభించిన వ్యాపారాలు ఇప్ప‌టికీ మంచి ఫ‌లితాల‌నే ఇస్తూ దూసుకువెళుతున్నాయి. మ‌రో నాలుగైదేళ్ల‌లో వ‌ర్షా తిరిగి వ‌స్తే... ఆమె త‌న తండ్రి ప్రారంభించిన వ్యాపారాల‌ను చేప‌డితే... అవి మ‌రింత‌గా వృద్ధి సాధించ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏది ఏమైనా... ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ఉన్న జ‌గ‌న్ ఇంట... దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ఆర్థిక వేత్త త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్న మాట‌.


Tags:    

Similar News