సెప్టెంబర్ 2 పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదినం. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ కోలాహలం, హడావుడి కనిపించే అవకాశం లేకపోవడంతో పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్ అప్పటికప్పుడే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం విధిస్తున్నామని.. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ఈ నిర్ణయంపై పవన్ అభిమానులు, అటు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల తయారీపై పొట్టు పోసుకుంటున్నవారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా జగన్ నిర్ణయంపై దుమ్మెత్తి పోశారు. పవన్ కల్యాణ్ జన్మదినం సందర్బంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకుండా ఉండటానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి సినిమా టికెట్ రేట్లు తగ్గించడం చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా పవన్ సినిమాలనే లక్ష్యంగా చేసుకునే ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శలు చేస్తున్నారు. పవన్ సినిమా భీమ్లా నాయక్ విడుదలయ్యాక మళ్లీ ఆ విషయాన్ని మరిచిపోయారని అంటున్నారు.
ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీ, బ్యానర్ల నిషేధం కూడా అలాంటిదేనా అని జగన్ ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు అవ్వగానే మళ్లీ ఈ నిర్ణయాన్ని అటకెక్కిస్తారని చెబుతున్నారు.
మరోవైపు పవన్ జన్మదినం సందర్భంగా పవన్ సూపర్ హిట్ సినిమాలు.. తమ్ముడు, జల్సా, బద్రి తదితర సినిమాలను 4కె అల్ట్రా హెచ్‌డీలో విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాల పోస్టర్లను, ఫ్లెక్సీలను, బ్యానర్లను వేయించి థియేటర్ల ముందు భారీగా హడావుడి చేయాలని నిర్ణయించారు.
అయితే ఈలోపే ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరాశ చెందిన పవన్ అభిమానులు కొత్తగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. క్లాత్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై దృష్టి సారిస్తున్నారు. ఆయిల్ పెయింటింగ్స్ తో థియేటర్స్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
ప్లాస్టిక్ బ్యానర్స్ ను నిషేధించిన మాత్రాన తగ్గేదేలే అని పవన్ అభిమానులు కదులుతున్నారు. ప్రస్తుతం ఈ ఆయిల్ పెయింటింగ్స్ వైరల్ గా మారాయి. థియేటర్స్ వద్ద మునుపెన్నడూ చూడని ఆయిల్ పెయింటింగ్స్ ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.