పాదయాత్ర... 'దేశా' నికి చేదుమాత్ర

Update: 2018-08-26 01:30 GMT
పాదయాత్ర. రాష్ట్రంలో రాజకీయ నాయకులు తమకు అధికారం తీసుకువచ్చే సాధనంగా చూస్తారు. అయితే ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను ప్రజల కష్టాలు, వారు పడుతున్న ఇక్కట్లు తెలుసుకోవడం కోసం చేపడుతున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర ఉద్యేశ్యం కూడా అదే కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రంతో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2800 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నారు. ఈ పాదయాత్రను మూడు వేల కిలోమీటర్ల టార్గెట్‌ తో జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటికీ, ప్రజలలో వస్తున్న స్పందన ద్రుష్టిలో పెట్టుకుని 3500 కిలోమీటర్ల వరకూ పొడిగిస్తున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వై.ఎస్. జగన్ ఇంకా విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. అంతే కాదు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. జగన్ పాదయాత్రను పార్టీ శ్రేణులు చాల జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు స్పందన పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం పుట్టిస్తోంది. పార్టీ నాయకులంతా కూడా గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. వైఎస్ ఆర్ పార్టీలో టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్దులంతా తమ నాయకుడి బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉండడంతో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను తెలంగాణలో కూడా చేపట్టే అవకాశాలున్నాయి. అయితే ముందుగా ఆంధ్రప్రదేశ్‌ లో అన్ని జిల్లాల్లోనూ ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ యాత్రలో ప్రజల కష్టాలు తెలియడంతో అధికారంలోకి వచ్చాక వారిని ఆ కష్టాల నుంచి ఎలా బయటపడేయ్యాలో పరిష్కారం కూడా తెలుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రలో జగన్‌ను కలిసిన వారంతా ఆయనపై చూపిస్తున్న ప్రేమానురాగాలకు కూడా అధికార పక్షం నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఈ పాదయాత్రతో ప్రజల్లో జగన్ కు సానుభూతి విపరీతంగా పెరుగుతోందని ఇంటిలెజెన్సీ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. పాదయాత్రకు వచ్చిన వారంతా స్వచ్చంధంగా వచ్చిన వారేనని, వారిని ఎవరూ బలవంతంగానూ, డబ్బులిచ్చి కాని తీసుకువచ్చిన వారు కాదని కూడా ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ నివేదికలు కూడా అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఇప్పటి వరకూ చేసిన పాదయాత్రకే ప్రజా స్పందన ఇలా ఉంటే దాన్ని మరింత పెంచితే ఇంక ఇబ్బందేనని తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు. ఇదే విషయాన్ని తమ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కూడా చెప్పినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News