రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలపై వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనిషి మృగంలా మారుతున్నాడని ధ్వజమెత్తారు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలే అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆంధ్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచార ప్రకటనను ప్రతిపక్ష నేత జగన్ తన పాదయాత్రలో ప్రత్యేకించి గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా "ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయమేస్తోంది...ఆయనొస్తే మహిళలకు బాగుంటుంది అని"...చంద్రబాబు ను ఉద్దేశించి ఎన్నికలప్పుడు భారీగా ఇచ్చిన అడ్వర్టయిజ్ మెంట్లు మీకు గుర్తుండే ఉంటాయి. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని జగన్ అన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు పాలన చూసినప్పుడు తిలక్ గారి మాటలు గుర్తుకు వస్తాయి..‘‘గజానికో గాంధారి పుత్రుడు ’’ అన్నది ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో అన్యాయం - అవినీతి - అధర్మం - మోసాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల పాలనను గమనించమని కోరుతున్నానని జగన్ అన్నారు.
నాలుగేళ్లుగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతే 240 మంది ఆడపడుచులపై లైంగిక దాడులు జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మృగం కాడా? అని జగన్ ప్రశ్నించారు. `మొన్న ఉప్పుచర్లలో, నిన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ ఘటన, గుంటూరు జిల్లాలోనే 11 కేసులు. మహిళలపై అత్యాచార కేసులు. మనిషి మృగంలా ఎందుకు మారుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే..తాను తప్పు చేసినా అడిగే ధైర్యం ఎవరికి లేదని, ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుందని, తనను ఏమీ చేయలేరని మనిషి బరితెగించినప్పుడు మనిషి మృగమవుతాడు. అధికారంలో ఉన్నవారు తప్పుచేసిన వారికి సపోర్టు చేయడంతో మనిషి మృగమవుతున్నాడు. మీరు అవినీతి చేసుకోండి..అడ్డంగా సంపాదించుకోండి..నాకు కొంత ఇవ్వండని అధికారంలో ఉన్నవారు ప్రోత్సహిస్తే..మనిషి మృగమవుతాడు. ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ పంచాయతీ వ్యవస్థను నీరుగార్చి ..జన్మభూమి కమిటీల పేరుతో ముఠాలు ఏర్పాటు చేస్తే మృగంలా మారుతారు. మద్యం నిషేదించాల్సింది పోయి మన ఇంటి పక్కనే గుడి పక్కనే మద్యం షాపులు పెడితే అప్పుడు మనిషి మృగమవుతాడు. దేశంలో మహిళలపై వేధింపుల కేసుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదు మంత్రుల పేర్లు ఉంటే..అందులో ఏపీకి చెందిన ఇద్దరు మన రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నారు. వాళ్లని ముఖ్యమంత్రి సపోర్టు చేస్తే మనిషి మృగమవుతారు`` అంటూ జగన్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా పలు అంశాలను జగన్ ప్రస్తావించారు. `వనజాక్షి వంటి మహిళా అధికారిణి తన డ్యూటీ చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ఆ మహిళా అధికారిణిని జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లినా ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టకపోతే మనిషి మృగాలు కాక ఏమవుతారు? రిషితేశ్వరి అనే అమ్మాయి ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటే..ప్రిన్సిపాల్‌ను వెనుకేసుకొచ్చిన సీఎం తీరు చూస్తే మృగాలు కాక ఏమవుతారు? కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో టీడీపీ నేతలు, వారి బంధువులు ఉంటే వ ఆరికి చంద్రబాబు సపోర్టుగా నిలిచారు? ఎప్పుడైతే ముఖ్యమంత్రి నోట్లో నుంచి కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని వెకిలి నవ్వుతో చంద్రబాబు అంటే మనిషి మృగాలు కాక ఏమవుతారు? ` అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు వస్తే మహిళలకు భద్రతలేని పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. అవినీతి, అబద్ధాలు, మోసాలు.. వీటితో పాటు రోజుకో డ్రామాకు తెరతీస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలన కొనసాగిందని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రే దళారిగా మారి అక్రమాలు చేస్తున్నారన్న వైఎస్ జగన్...చంద్రబాబు సినిమాల్లో నటించి ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఉత్తమ విలన్ అనే అవార్డు ఆయనే సొంతం చేసుకునేవారని ఎద్దేవా చేశారు.