గడిచిన 31 రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సినిమా యాక్టరనో.. అలాంటి వ్యక్తినో పక్కన పెట్టుకొని వస్తారని.. ఆ యాక్టరేమో తనదే పూచీ.. బాబుకు ఓట్లు వేయండని చెబుతాడని.. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దంటూ మండిపడ్డారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ కూటమికి తన మద్దతు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని.. మోడీ.. బాబులను నమ్ముతున్నట్లుగా పవన్ చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో పవన్ ఎంతమాత్రం ప్రశ్నించారు.. ఏ మేరకు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారో అందరికి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఏపీకి కొత్త జీవాన్ని ఇచ్చే ప్రత్యేక హోదా అంశాన్ని పాతరేసిన మోడీని కనీసం ప్రశ్నించలేని పరిస్థితి.
సభలు పెట్టి నాలుగు ఆవేశపూరిత మాటలు చెప్పే కన్నా..నిర్మాణాత్మక పాత్ర పోషించే విషయంలో పవన్ విఫలమయ్యారని చెప్పక తప్పదు. తాజాగా మళ్లీ ప్రజల్లోకి వస్తున్న పవన్.. తన నాలుగు రోజుల ఏపీ పర్యటనలో పెద్ద ఎత్తున మాటలు చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని నాలుగు ముక్కల్లో తేల్చేస్తే.. బాబును అభిమానిస్తా.. ఆరాధిస్తా.. ఎందుకంటే ఆయనకు అనుభవం చాలా ఎక్కువ.. సీఎం కావాలంటే ఆసక్తి కావాలంటే బాబును ముఖ్యమంత్రిని చేయటమే తన లక్ష్యమన్నట్లు మాట్లాడారే తప్పించి.. ఏపీ ప్రజలకు తాను అండగా నిలుస్తానని.. సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని.. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను మరింతగా ఇన్ వాల్వ్ కానున్న విషయాన్ని ఆయన చెప్పింది లేదు. ఇలాంటి వేళ జగన్ పవన్ పైనా..చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు.
పవన్ ను విమర్శించే అంశంపై ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్.. తాజాగా పవన్ ప్రస్తావన తీసుకురాకుండానే చంద్రబాబును దులిపేసే ప్రోగ్రాం షురూ చేశారు. సినిమా యాక్టర్లను తీసుకొచ్చి చంద్రబాబుకు తానే పూచీకత్తు లాంటి మాటలు చెప్పే వారిని నమ్మొద్దన్న మాటలు చెబుతున్న జగన్ తీరు చూస్తే.. రానున్నరోజుల్లో బాబు.. పవన్ ల మీద విమర్శల తీవ్రత మరింత పెరగటం ఖాయమనిపించకమానదు.