అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో జరగుతున్న చర్చలో పాల్గొంటూ వైఎస్ జగన్ అధికార పక్షంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరు ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుంది అని అన్నారు. అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో అధికార పక్ష సభ్యులు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. మనసుకు బాధ కలిగించే వ్యాఖ్యలు ఎన్నో చేస్తున్నారని జగన్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై కూడా అధికార పార్టీ సభ్యులు అవాస్తవాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. పరిటాల రవి హత్య కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నారన్న జగన్ ...వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ఆయన కేబినెట్ లో మంత్రిగా పని చేసిన హరిరామ జోగయ్య ఒక పుస్తకం రాశారని జగన్ అన్నారు. ఈ విషయం ప్రస్తావిస్తుంటే అధికార పక్షం ఎందుకు భయపడుతోందని జగన్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై 20 అవినీతి ఆరోపణలు ఉన్నాయని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయిలు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే ఆశ్చర్యమేస్తోందని జగన్ అన్నారు. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీలోకి చేరిన 8 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అధికార పక్షం తనపై ఆరోపణలు చేస్తున్నదని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ అందరూ అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకే అవిశ్వాసం పెట్టామని జగన్ చెప్పారు. తమ పార్టీకున్న సంఖ్యాబలంతో అవిశ్వాస తీర్మానం గెలవదని తనకు తెలుసునని చెప్పిన జగన్...ప్రభుత్వ విధానాలను సభ వేదికగా ఎండగట్టడం కోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు.
ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని కానీ రుణాలను మాఫీ చేయలేదని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి రైతులు నష్టపోయారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని రైతులు కరవుతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ,రైతులకు మద్దతు ధర ఇప్పించే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని ఆయన అన్నారు. విజయవాడలో ఆశా వర్కర్లు ధర్నా చేస్తుంటే అరెస్టు చేయించారని జగన్ అన్నారు. డీఎస్సీ రాసిన విద్యార్థులు రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పంద,పొరుగు సేవల సిబ్బంది తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనని భయపడుతున్నారని జగన్ అన్నారు. కాపుల రిజర్వేషన్ హామీని చంద్రబాబు విస్మరించడం వల్లనే కాపులు ఉద్యమ బాట పట్టారని పేర్కొన్నారు. రుణమాఫీ అంటూ రైతులను నిలువునా ముంచారని విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే మరిచారన్నారు.