వీడియోలు చూపిస్తూ వాయించేస్తున్న జగన్!

Update: 2016-09-23 04:23 GMT
2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏయే సభలపై ఏయే విషయాలు మాట్లాడారు - ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రసంగాలు చేశారు.. ఎన్నికల అనంతరం క్రమ క్రమంగా హోదా విషయాన్ని ఎలా నీరుగార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారు అనే విషయాలను - వారి గత ప్రసంగాల వీడియో క్లిప్పులు చూపిస్తూ ఏకిపారేస్తున్నారు వైఎస్ జగన్! ఆ మాట తాము అనలేదని, మీడియా వక్రీకరించిందని చెప్పే అవకాశం లేకుండా వీడియో క్లిప్పింగులు చూపిస్తూ జగన్... బాబు - వెంకయ్యలను ఇరుకున పెడుతున్నారు.

ముందుగా ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతిలో "ప్రత్యేక హోదా పదేళ్లు కాదు - పదిహేనేళ్లు కావాలి" అని చంద్రబాబు కోరిన వీడియో చూపించిన జగన్.. ఇదే సందర్భంగా మోడీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు బాబు ప్రకటించడాన్ని చూపించారు. తర్వాతి బైట్ లో ఎన్నికల తర్వాత సీఎం హోదాలో ఢిల్లీలోనూ - ఏపీలోనూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని రకాలుగా మాట్లాడారు అనే విషయాలను - బాబు ప్రసంగం బైట్లను చూపిస్తూ... చివరిగా, "ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే లాభమేమిటి? అని చంద్రబాబే తిరిగి ప్రశ్నించే వరకు ఉన్న వీడియోలను ప్రదర్శించారు. దీంతో చంద్రబాబుని అడ్డంగా బుక్ చేసిన జగన్... 2014లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలోని వెంకయ్య నాయుడి వీడియోను కూడా చూపించారు. ఆ వీడియోలో వెంకయ్య తనదైన శైలో ప్రసంగిస్తూ ప్రత్యేక హోదాను కోరగా.. అనంతరం తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ చెప్పిన విషయాన్ని వెంకయ్య స్వయంగా తర్జుమా చేశారు. ఈ వీడియోలను కూడా జగన్ ప్రదర్శించారు.

ఈ విదంగా ఎన్నికల ముందు, తర్వాత అనే స్థాయిలో చంద్రబాబు, వెంకయ్యల మోసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన జగన్... ఎన్నికల తర్వాత ప్రజలతో పని అయిపోయిందన్నట్లుగా నేడు వారు మాట్లాడుతున్నారని అన్నారు. నిన్నమొన్నటి దాకా హోదా గొప్పది అని చెప్పిన వీరే.. ఇప్పుడు దాని వల్ల మేలు ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారంటే ఎంత గ్లోబెల్స్ ప్రచారం చేశారో అర్థమవుతోందని వైఎస్ జగన్ అన్నారు.
Tags:    

Similar News