ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కంటికి, తలకు తీవ్ర గాయాలైనట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చికిత్సకు మాత్రం భారీగానే ఖర్చు అవుతోందని తెలిసింది.చాలా మంది విరాళాలు ఇస్తామన్న సొంత ఖర్చులతోనే కత్తి మహేష్ చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి.
ప్రార్థించే పెదవులు కన్నా.. చేసే సాయం మిన్న అన్నారు పెద్దలు.. కత్తి మహేష్ వివాదాస్పద క్రిటిక్ గా ఎంతమందిపై దుమ్మెత్తిపోసినా సరే ఆయన ఆపదలో ఉన్నాడని తెలియగానే చాలామంది సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా సాయం చేస్తామన్నా కత్తి మహేష్ తీసుకోలేదట..
అయితే కత్తి మహేష్ విషయంలో ఏపీ ప్రభుత్వం మానవత్వంతో స్పందించినట్టు తెలుస్తోంది. ఎవరూ కోరకుండానే తనకు తానుగా పెద్ద సాయాన్ని ప్రకటించింది. ఏకంగా కత్తి మహేష్ ఆస్పత్రి ఖర్చులన్నీ భరించేందుకు ముందుకు వచ్చింది.
చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి ‘సీఎంఆర్ఎఫ్’ కింద రూ.17 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొంతకాలంగా జనసేన, టీడీపీలను విమర్శిస్తూ వైసీపీకి మద్దతుగా కత్తి మహేష్ రాజకీయం చేస్తున్నారు. పలు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఈ సాయం చేయడం విశేషం.
నెల్లురు జిల్లాలో వారం రోజుల క్రితం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ముందుగా నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కత్తి మహేష్ ను ఆయన స్నేహితులు అయిన సినిమా రంగానికి చెందిన దర్శకుడు సాయి రాజేశ్, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిలు దగ్గరుండి చూసుకుంటున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ వారు వెల్లడించినట్టు తెలిసింది. కత్తి మహేష్ కంటికి గాయమైందని..పలు శస్త్రచికిత్సలు చేశారని.. ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసింది.