పంచాయితీ ఎన్నికలకు జగన్ సర్కార్ నై.. హైకోర్టుకు..

Update: 2021-01-09 13:30 GMT
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సై అంటుండగా.. ఏపీ సీఎం జగన్ మాత్రం నై అంటున్నారు. వీరిద్దరి పంచాయితీ గత సంవత్సర కాలంగా కోర్టులు, బయటా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఉన్న ఫళంగా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వేసి నిమ్మగడ్డ ఏకంగా జగన్ సర్కార్ కు షాకిచ్చారు. ఏపీ అధికారులు స్థానిక సంస్థలు నిర్వహించడం సాధ్యం కాదని కలిసి వివరించి వెళ్లిపోయాక వెంటనే ఈ ప్రకటన జారీ చేశారు.

దీంతో జగన్ సర్కార్ దీనిపై తాజాగా హైకోర్టుకు ఎక్కింది. కరోనా వ్యాక్సినేషన్ ఉండడం. కరోనా పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని.. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు హౌస్ మోహన్ పిటీషన్ దాఖలు చేసింది.  సోమవారం ఈ పిటీషన్ పై విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.

గతంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ హైకోర్టుకు ఎక్కారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు మొదట ఎస్ఈసీతో భేటి అయ్యి చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. ఈ ప్రకారం ఏపీ ఉన్నతాధికారులు నిమ్మగడ్డతో భేటి అయ్యి కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని అధికారుల బృందం ఎస్ఈసీని కోరింది.

కానీ ఈ భేటి ముగిసిన వెంటనే నిమ్మగడ్డ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అధికారుల మాటను లెక్కచేయకుండా ఏకంగా కొన్ని గంటల్లోనే నాలుగుదశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు.  ఈ ప్రకటనను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు సోమవారం నుంచి విచారణ జరపనుంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశించి జగన్ సర్కార్ ముందరి కాళ్లకు బంధం వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని, పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల్లో అమలయ్యే పథకాలపై నిర్ణయాలు తీసుకోవద్దని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈ దుమారానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News