జగన్ సర్కార్ వినూత్న నిర్ణయం.. స్కూల్ పరిసరాలు మారిపోతాయంతే

Update: 2021-06-29 03:57 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నాడు - నేడు పథకం ద్వారా స్కూల్ రూపురేఖలు మొత్తాన్ని మార్చేస్తున్న ఆయన.. తాజాగా స్కూల్ పరిసరాలు సైతం మొత్తం మారేలా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం.. ఏపీలోని ఏ సర్కారీ స్కూలుకైనా సరే.. 200 మీటర్ల దూరం వరకు గుట్కా.. పాన్ షాపులు ఉండకూడదని డిసైడ్ చేశారు. దీంతో.. సర్కారీ స్కూళ్ల చుట్టూ కలుషిత వాతావరణానికి చెక్ పెట్టటమే దీని అసలు ఉద్దేశ్యమట.

ఈ నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా ఏఎన్ఎంలను వినియోగించనున్నారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు.. మూడు స్కూళ్ల బాధ్యతను అప్పజెప్పనున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్ ను సిద్ధం చేశారు. ఈ యాప్ ద్వారా.. ఏదైనా ప్రభుత్వ స్కూల్ దగ్గర సిగరెట్.. గట్కా లాంటి నిషేదిత సామాగ్రి అమ్ముతున్నట్లు గుర్తించిన వెంటనే ఫోటో తీసి ఈ యాప్ లో అప్ లోడ్ చేస్తే.. సంబంధిత శాఖ అధికారులు వచ్చి ఆ షాపు మీద చర్యలు తీసుకుంటారు.

చెడు అలవాట్ల ప్రభావం చిన్నారుల మీద పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్టన్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. మొత్తంగా ఏపీలో సర్కారీ స్కూళ్లు మాత్రమే కాదు.. స్కూళ్ల పరిసరాలు మొత్తం మారేలా నిర్ణయం ఉందని చెప్పాలి.
Tags:    

Similar News