జ‌గ‌న్ హిట్ లిస్టు రెఢీ ? లిస్టు పెద్దదేనట

Update: 2022-07-23 13:30 GMT
న‌లుగురు  కాదండి 40 మందిని త‌ప్పిస్తారు. వారి స్థానంలోనే కొత్త ముఖాలు కనిపిస్తాయని అంటున్న వైసీపీ వర్గాలు. ఇదే  హాట్ టాపిక్ గా ఉంది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఇద్ద‌రు ఎక్స్-డిప్యూటీలకూ  మ‌ళ్లీ నో ఛాన్స్ అని తేలిపోయింది.వాళ్ల‌ను పార్టీ బ‌లోపేతం కోసం వాడుకుని, ఫ‌లితాలు వ‌చ్చాక నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల‌ని కూడా అనుకుంటున్నారట. వీరి స్థానంలో కొత్త వారి వెతుకులాట కూడా షురూ అయిందంటున్నారు.

ఇదే స‌మయంలో జగ‌న్ ఫార్ములా ప్రకారం ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ఐదుగురు పేర్లు టాప్ ప్ర‌యార్టీలో తీసుకుంటున్నారంట. ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్  కూడా సంబంధిత స‌మర్థుల వేట మొద‌లు పెట్టిందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అయితే గ‌త ప్ర‌భుత్వాధినేత‌ను ఇంటెలిజెన్స్ నివేదిక‌లు త‌ప్పు ప‌ట్టించాయ‌న్న వాద‌న‌ కూడా ఉండ‌డంతో సీన్లోకి చెవిరెడ్డి లాంటి వారు కూడా రానున్నారు. వారు కూడా స‌ర్వేలు చేయించి నిజానిజాలు నిగ్గు తేల్చ‌నున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఉత్త‌రాంధ్ర‌లో సీనియ‌ర్లంతా  సైడ్ అయిపోవాల్సిన త‌రుణం రానే వ‌చ్చింద‌ని పార్టీ వర్గాలే అంటున్నాయి. మ‌రోవైపు బొత్స‌కు ఇంటి త‌ల‌నొప్పి ఉంది. అది కూడా సాల్వ్ కావ‌డం లేదు. ఒక‌నాటి బొత్స ప్రయార్టీలు ఇప్ప‌టి ప్ర‌యార్టీలు పూర్తిగా మారిపోయాయి.

విజ‌య‌న‌గ‌రం జిల్లా మొత్తం చిన్న శ్రీ‌ను గుప్పిట్లోకి పోయింద‌న్న విమర్శ పార్టీ స్థానిక కేడర్ లో కనిపిస్తోంది. క‌నుక ఆయ‌న్ను కూడా నిలువ‌రించాల‌ని  సీఎం  భావిస్తున్నారని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా సీన్లోకి జూనియ‌ర్ బొత్స రావ‌డం ఖాయ‌మ‌ని కూడా తేలిపోయింది. అంటే చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కిమిడి నాగార్జున (మాజీ మంత్రి కుమారుడు) కు దీటుగా బొత్స సందీప్ ప‌ని చేయాల్సి ఉంది.  ఓ విధంగా ఇదే ఇప్పుడు సీనియ‌ర్ బొత్స‌కు కూడా పెద్ద స‌వాల్. అదేవిధంగా విజ‌య‌న‌గ‌రంలో కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌రావు కూడా చిన్న శ్రీనుతో  చేతులు క‌లిపి రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న వాదనా వినిపిస్తోంది.కోల‌గ‌ట్ల కుమార్తె ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం  అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దింపాలని చూస్తున్నారట. అదేవిధంగా ప‌లు చోట్ల ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రంలో మార్పుల‌యితే రానున్నాయి.

అప్ప‌టిమాదిరిగా వైసీపీకి ఎంతో క‌లిసివ‌చ్చిన మ‌న్యం ప్రాంతంపై  మ‌ళ్లీ ప‌ట్టు పెంచుకోవాల‌ని నిన్న‌టి వేళ ఆ ప్రాంత ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణి కి సీఎం సూచించారు. ఒక‌వేళ  ఆమెను త‌ప్పించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇక్కడ రాజ‌కీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆఖ‌రి నిమిషంలో శ‌త్రుచ‌ర్ల కుటుంబం నుంచి ఎవ‌రో ఒక‌రు పార్టీలోకి వ‌చ్చి, టికెట్ కొట్టేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు.  పుష్ప శ్రీ వాణి ఆశ‌లు గ‌ల్లంతు  అయ్యే అవ‌కాశాలే పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈమె కూడా మంత్రి  ప‌దవిపోయాక యాక్టివ్ గా లేరని నిన్న‌టి వేళ తేలిపోయింది.

ఇక ఒంగోలులో త‌ల‌నొప్పుల‌కు కూడా చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారట. బాలినేని కుమారుడు పోటీలో ఉండే అవకాశాలున్నాయంటున్నారు.  మాజీ మంత్రి మేక‌తోటిని కూడా పార్టీ అప్ప‌గించిన బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ మీకు క‌ష్టం అయితే త‌ప్పుకోండి.. కొత్త ముఖాలు చూసుకుంటాను అని సీఎం అన్నారట. ఈయనతో పాటు ఇంకొంద‌రిపై కూడా వేటు ఖాయ‌మ‌ని తెలిపోయింది.

ఇక శ్రీ కాకుళం రాజ‌కీయాల్లో హ‌వా చూపించే ధ‌ర్మాన సోద‌రుల్లో ఒక‌రయిన కృష్ణ‌దాసుపై కూడా సీఎం అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఆయ‌న్ను ఉద్దేశించి కూడా రెబ‌ల్స్ ను దార్లోకి తెచ్చుకోకుంటే మీరు ప‌ద‌వి నుంచి త‌ప్పుకోండి అని ఎప్పుడో సీఎం చెప్పేశారు.  ఈ న‌లుగురే కాకుండా మ‌రికొంద‌రిపై కూడా సీఎం అసంతృప్తితో ఉన్నారు. నేను నిధులు ఇచ్చినా ప‌నులు చేయాల‌ని మీకు అనిపించ‌క‌పోతే నేనేం చేయ‌ను.. అని అంటూనే, త్వ‌ర‌లోనే హిట్ లిస్ట్ ఒక‌టి త‌యారు కానుంద‌ని కూడా ప‌రోక్ష సంకేతాలు ఇచ్చేశారు. మ‌రి ! ఆ హిట్  లిస్టులో చేరే న‌ల‌భై మంది ఎవ‌రు ?
Tags:    

Similar News