అమరావతి రాజధాని ప్రకటించకముందే.. ఎవరికి తెలియకముందే ఇన్ సైడర్ ట్రేడింగ్ తో టీడీపీ నేతలు అమరావతిలో భూములు కొల్లగొట్టి కొనిపెట్టుకొని కోట్లకు పడగలెత్తారని తాజాగా ఏపీ సీఐడీ దర్యాప్తులో వెలుగుచూసినట్టు తెలిసింది. అంతర్జాతీయ కుంభకోణానికి తలపించే ‘అమరావతి రాజధాని కుంభకోణం’లో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సహా టీడీపీ నేతలు, బినామీలు వందల ఎకరాలు కొన్నట్టు సీఐడీ విచారణలో నిగ్గుతేలినట్టు సమాచారం.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని స్వయంగా లోకేష్ బాబు, టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం కూడా దీనికి సిద్ధమైనట్లు తెలిసింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త విచారణ చేపట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. రేపటి కేబినెట్ మీటింగ్ లోనే ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై చర్చించి విచారణ బాధ్యతలను లోకాయుక్తకు అప్పగించే అవకాశాలున్నాయి. దాదాపు 4070 ఎకరాలు కొల్లగొట్టిన టీడీపీ నేతల బాగోతం లోకాయుక్త విచారణతో కొత్త మలుపు తిరగనుంది. వారంతా చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.