సీటు నిజంగా స్వీట్ గా ఉంటుంది. అయితే కోరుకున్నది ఇస్తే మరీ మధురంగా ఉంటుంది. ఏపీలో వచ్చే ఎన్నికలు వైసీపీకి కీలకం. అయితే ఎమ్మెల్యేల పనితీరు మీద వస్తున్న సర్వేలతో చాలా మందికి సీట్లు దక్కవని ప్రచారం సాగుతోంది. అలా చూసుకుంటే ఈ సంఖ్య చాలా పెద్దదిగానే ఉంది. అంటే దాదాపుగా ముప్పయి నుంచి నలభై మందికి సీట్లు దక్కవని అంటున్నారు. ఇందులో కొందరు పార్టీలో ఉండరని వైసీపీ హై కమాండ్ కి కూడా తేలిపోతున్న విషయం.
వారిని అలాగే వదిలేయాలని డిసైడ్ అవుతున్నారు. ఇక కొందరు పార్టీలో ఉన్నా వెళ్ళినా ఒక్కటే అందువల్ల వారి విషయంలోనూ అంత సీరియస్ గా ఆలోచించాల్సిన పని లేదు. అయితే కొందరు పార్టీకి ఉపయోగంగా ఉన్నా జనంలో గెలవకపోవచ్చు. లేదా గెలుపు అవకాశాలు ఉన్నా సామాజిక రాజకీయ సమీకరణల వల్ల టికెట్ ఇవ్వలేకపోవచ్చు. అలాంటి వారిని ఇపుడు ఏరి కోరి ఎమ్మెల్సీలుగా చేయాలని వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అంటున్నారు. టికెట్ మీద ఆశలు పెట్టుకుని చివరి క్షణంలో రాక ఇబ్బంది పడే కంటే ముందే టికెట్ రాదు అని చెప్పి పెద్దల సభకు వారిని పంపించి వారి సేవలను పార్టీ కోసం వాడుకోవాలని వైసీపీ యోచిస్తోంది అంటున్నారు.
ఈ ఏడాది జూన్ దాక చూస్తే 24 దాకా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి అంటున్నారు. అందులో 21 సీట్లు కచ్చితంగా వైసీపీ ఖాతాలో పడతాయి. ఇందులో ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా. లోకల్ బాడీ కోటాలో ఎలాగోలా 21 సీట్లు తమవే అని వైసీపీ లెక్కలేసుకుంటోంది.
వీటిలో చూస్తే పార్టీ కోసం పనిచేసిన వారికి రేపటి ఎన్నికల్లో అవసరం అయిన వారికే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారని అంటున్నారు. ఆ జాబితాను జగన్ జాగ్రత్తగా రూపొందిస్తున్నారు అని అంటున్నారు. అలా చూసుకుంటే విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ కి వైసీపీ టికెట్ కన్ ఫర్మ్ అయింది. అక్కడ టికెట్ ఆశిస్తున్న బొప్పన భవకుమార్ కి ఎమ్మెల్సీ ఇస్తారని అంటున్నారు. అదే విధంగా పర్చూరు లో టికెట్ కోసం వీర లెవెల్ లో ప్రయత్నించి భంగపడిన రావి రామనాధానికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారు అంటున్నారు. ఈ మధ్యనే పర్చూరుకి ఆమంచి క్రిష్ణ మోహన్ ని నియమించారు.
అదే విధంగా జగన్ అంటూ పలవరించే మర్రి రాజశేఖర్ కి ఈ దఫా ఎమ్మెల్సీ సీటు ఖాయమని అంటున్నారు. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో టికెట్ ఆశిస్తున్న మేకా శేషుబాబుని ఎమ్మెల్సీని చేస్తారు అని ప్రచారం సాగుతోంది. ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేస్తున్న వారిలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ని తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడుతున్నారు. దాంతో ఆయన సీటుని వేరే వారికి ఇస్తారని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో పోతుల సునీత కూడా రిటైర్ అవుతున్నారు. ఆమెకు చీరాల టికెట్ దక్కడం కష్టం కాబట్టి మరోసారి ఎమ్మెల్సీ సీటు ఇస్తారని తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజుకు మరో దఫా కొనసాగింపు ఉంటుందా లేదా అన్నది చూడాలి. అలాగే ఆళ్ళగడ్డ కీలకం, అక్కడ నుంచి గంగుల ప్రభాకరరెడ్డి ఉన్నారు. ఆన ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్నారు. మరి ఆయనకు రెన్యూవల్ ఇస్తారా లేక కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు కాబట్టి వేరే వారికి చాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.
ఇంకో వైపు కర్నూల్ జిల్లాలో చల్లా కుటుంబం నుంచి ఇటీవల మరణించిన చల్లా భగీధరరెడ్డి సతీమణి లక్ష్మికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అంటున్నారు. విజయవాడలో చూసుకుంటే గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఈసారి వంశీకి ఇస్తున్నారు. దాంతో అసంతృప్తి గా ఉన్న దుట్టా రామచంద్రరావు యార్లగడ్డ వెంకటరావులలో ఒకరికి కచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అంటున్నారు. అలా వారిని బుజ్జగిస్తారని తెలుస్తోంది.ఈ విధంగా పార్టీలో పేచీలు ఎంతో కొంత తగ్గించుకోవాలని జగన్ స్కెచ్ వేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ అయ్యాక ఆరేళ్ళ పాటు అధికారం వారి చేతిలో ఉంటుంది. ఎన్నికల వేళకు వారు అడ్డం తిరిగితే ఏం చేస్తారు అన్న దానికి మాత్రం ఆలోచించాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.