ఒకవైపు తెలుగునాట మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగుదేశం తరఫున ప్రచారాన్ని ఊదరగొడుతోంది. పదికి పైగా టీవీ చానళ్లు - రెండు ప్రధాన పత్రికలు తెలుగుదేశం పార్టికి ఓపెన్ గా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ముసుగు ఏదీ లేదన్నట్టుగా ఓపెన్ గా అవి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి! చంద్రబాబు గెలుపులోనే ఆ మీడియా వర్గాల ప్రయోజనాలు అన్నీ ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఇది జనాలకు కూడా తెలియని విషయం ఏమీ కాదు. అయినా నిర్మొహమాటంగా ఆ మీడియా వర్గాలు తమ పనిని తాము చేస్తూ ఉన్నాయి.
ఇక టీడీపీ సొంత మీడియాగా పేరు గాంచిన మీడియా సంగతలా ఉంటే.. సెల్ప్ బ్రాడ్ కాస్టింగ్ మీడియా అనదగ్గ వెబ్ - సోషల్ మీడియాలో మాత్రం జగన్ హవా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తమకు ఎలాగూ మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయదని తెలిసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొదటి నుంచి సోషల్ మీడియా మీద కాన్సన్ ట్రేట్ చేశాయి. సోషల్ మీడియాలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ శ్రేణులు మరింత గట్టిగా - ఉత్సాహవంతంగా పని చేస్తూ ఉన్నాయి.
ఇక వెబ్ మీడియాలో జగన్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉన్నారు. గూగుల్ రికార్డులే ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. గూగుల్ ట్రెండ్స్ లో పరిస్థితిని గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతూ ఉంది. ప్రత్యేకించి గత నెల రోజులుగా గూగుల్ లో జగన్ టాపిక్ ట్రెండింగ్ లో దూసుకపోతోంది.
వెబ్ లో ఎవరికి గురించి ఎక్కువ సెర్చ్, ఎవరి గురించి ఎక్కువ క్లిక్స్ వస్తూ ఉంటాయో వాటినే గూగుల్ ట్రెండ్స్ లో చూపిస్తూ ఉంటుంది. గూగుల్ ద్వారా ఏ టాపిక్స్ కు - ఏ నేమ్స్ కు ఎక్కువ ట్రాఫిక్ వెళ్తూ ఉంటుందో.. అదే గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో ఉంటుంది. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేమ్ కూడా అలాగే ట్రెండింగ్ లో టాప్ లో ఉంది.
ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో పోల్చి చూసినప్పుడు గూగుల్ ట్రెండ్స్ లో జగన్ చాలాముందు ఉండటం కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.
గూగుల్ ట్రెండ్స్ స్కేల్ ప్రకారం.. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ గత నెల రోజుల్లో కాస్తంత కింది నుంచి పాతిక పాయింట్ల వరకూ వచ్చింది. అదే జగన్ గ్రాఫ్ మాత్రం నెల కిందటే పాతికకు పై స్థాయిలో ఉండింది. అక్కడ నుంచి పైపైకి పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం ఆ స్కేల్ గ్రాఫ్ డెబ్బై ఐదు స్థాయికి చేరింది. చంద్రబాబుతో పోలిస్తే జగన్ గ్రాఫ్ చాలా హై లెవల్లో ఉండటం గమనార్హం!
వెబ్ మీడియాలో - గూగుల్ లో జగన్ పై జరుగుతున్న అన్వేషణ - జగన్ వార్తలకు ఉన్న ఆదరణ నేపథ్యంలో ఇలా జగన్ నేమ్ గూగుల్ ట్రెండ్స్ బాబు కన్నా చాలా పై స్థాయిలో ఉందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. యువతరం ఎక్కువగా మమేకం అయ్యే వెబ్ మీడియాలో జగన్ దూకుడు కనిపిస్తూ ఉండటం విశేషం!