జ‌గ‌న్ ఎంపిక‌లో ప్ర‌త్యేక‌త‌లు గ‌మ‌నించారా?

Update: 2019-03-18 03:33 GMT
గంపెడు స‌మాచారాన్ని ముందేసుకొని.. లెక్క‌ల‌తో కిందా మీదా ప‌డ‌టం ఏపీ ముఖ్య‌మంత్రికి అల‌వాటే. ఎన్నిక‌లు ఎప్పుడైనా.. అధికారంలో ఉన్నా.. విప‌క్షంలో ఉన్నా ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ టికెట్ల కేటాయింపు విష‌యంలో కిందా మీదా ప‌డ‌టం బాబుకు అల‌వాటే. ఈ తీరును ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితులు సైతం విసుక్కుంటారు. ఏమిటి?  చంద్ర‌బాబును విసుక్కునే వారు.. ఆయ‌న తీరును ఆయ‌న ముఖం  మీద‌నే చెప్పేసేటోళ్లు ఉన్నారా? అంటే.. ఉన్నార‌నే చెప్పాలి. ఆయ‌న‌కు జిగిరీగా వ్య‌వ‌హ‌రించే కొంద‌రు ముఖ్యులు.. అభ్య‌ర్థుల ఎంపికలో చోటు చేసుకునే సాగ‌తీత‌పై బాబుకు క్లాస్ పీకుతుంటార‌ని చెబుతారు.

దీనికి భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌.. యువ‌నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్టైల్ ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఫ‌టా ఫ‌ట్.. ధ‌నా ధ‌న్ అన్న చందంగా చేయాల్సిన హోంవ‌ర్క్ ను ఆచితూచి అన్న‌ట్లుగా చేసి.. ఒకేసారి 175 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌టం ద్వారా జ‌గ‌న్ సంచ‌ల‌నం సృష్టించారు.

ఒక్క‌సారి డిసైడ్ అయ్యాక మ‌ళ్లీ అందులో మార్పులు చేర్పులు చేసి.. గంద‌ర‌గోళానికి గురి కావటం.. హెలికాఫ్ట‌ర్ నేత‌ల్ని అక్కున చేర్చుకొని పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేయ‌టం లాంటివి జ‌గ‌న్ లో క‌నిపించ‌వు. తాజాగా ఆయ‌న ప్ర‌క‌టించిన 175 స్థానాల అభ్య‌ర్థుల‌కు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయని చెప్పాలి. 175 మంది అభ్య‌ర్థుల్లో వ‌య‌సుల వారీగా విభ‌జిస్తే.. యువ‌త మొద‌లు అపార‌మైన అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత‌లున్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

తాజా టికెట్ కేటాయింపుల్లో 45 ఏళ్ల లోపు వారు 33 మంది ఉంటే.. 60 ఏళ్ల లోపు ఉన్న వారు 98 మంది. ఇక‌.. 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు 44 మంది ఉండ‌టం ద్వారా అనుభ‌వానికి జ‌గ‌న్ పెద్ద పీట వేశార‌ని చెప్పాలి. ఇక‌.. సిట్టింగుల్లో 40 మంది ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇచ్చిన జ‌గ‌న్‌.. మ‌రో ముగ్గురు ఎమ్మెల్సీల‌కు.. 12 మంది మాజీ మంత్రుల‌కు.. ఇద్ద‌రు మాజీ ఎంపీల‌కు ఆయ‌న టికెట్లు కేటాంయించారు. అంతేకాదు.. ఆయ‌న టికెట్లు ఇచ్చిన వారిలో 37మంది మాజీ ఎమ్మెల్యేల‌కు.. ఒక మాజీ ఎమ్మెల్సీకి.. ముగ్గురు గ‌తంలో ఎంపీలుగా పోటీ చేసిన వారికి.. మ‌రో 21 మంది గ‌తంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి ఆయ‌న టికెట్లు కేటాయించారు.

టికెట్ల కేటాయింపులో 15 మంది డాక్ట‌ర్లు ఉండ‌గా.. తొమ్మిది మంది ఆలిండియా స‌ర్వీసుల్లో ఉన్న వారే కావ‌టం విశేషం. అంతేకాదు.. టికెట్ల‌ను సొంతం చేసుకున్న వారి విద్యార్హ‌త‌ల్ని చూస్తే.. 41 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా.. 98 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 175 స్థానాల‌కు 139 మంది ఉన్న‌త విద్యను అభ్య‌సించిన వారే కావ‌టం ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ మొత్తాన్ని చూస్తే.. జ‌గ‌న్ విడుద‌ల చేసిన జాబితా స‌మ‌తూకాన్ని ఏ మాత్రం మిస్ కాలేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.
Tags:    

Similar News