వైసీపీ రాజ్యసభ బెర్తులు..ఎనీ వన్ కెన్ గెస్?

Update: 2020-02-28 22:30 GMT
ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో ఇప్పుడు ఓ చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలో ఆ పార్టీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లు ఎవరెవరికి దక్కనున్నాయన్న విషయం తెలియక ఆ పార్టీ నేతలు జుత్తు పీక్కుంటున్నారు. ఇక ఇదిగో ఈ నలుగురికే ఆ నాలుగు సీట్లు అంటూ ఎప్పటికప్పుడు కొత్త పేర్లు - కొత్త ఈక్వేషన్లతో వార్తలు వండి వార్చే మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఆసక్తికర కథనాలు రాస్తున్నా... వాటికి కూడా ఈ విషయంలో పార్టీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతరంగం ఏమిటన్నది పట్టుకోవడం దుస్సాధ్యమేనన్నవాదన వినిపిస్తోంది. అధికారం చేతికందాక జగన్ ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే... ఇప్పుడు రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఖరారును కూడా జగన్ గోప్యంగానే ఉంచుతారని, జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులను జగన్ స్వయంగా ప్రకటించే దాకా... జగన్ ఎంపిక చేసిన అభ్యర్ధులు వీరేనని చెప్పడం దాదాపుగా ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ గెస్సింగ్ ను ‘నో బడీ క్యాన్ క్యాచ్’ అంటూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

ఆయా పదవులకు - పార్టీ నుంచి పార్టీ నేతల ఎంపిక విషయంలో జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలోని పలువురు కీలక నేతలకు టికెట్ల విషయంలో  ఓ మోస్తరుగా జగన్ అంచనాలను పట్టేసిన మీడియా పలు కీలక స్థానాలకు జగన్ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా చూసి ఖంగు తిన్నదనే చెప్పాలి. ఆ తర్వాత వైసీపీ ఎన్ని సీట్లను గెలుస్తుందన్న విషయంలోనూ ఏ ఒక్కరు కూడా జగన్ అంచనాను పట్టలేకపోయారు. అయితే ఈ ఎన్నికల్లో మనం గెలుస్తామని - మన పార్టీకి ఈ మేర స్థానాలు వస్తాయని జగన్ ధీమాగా ఉండిపోయారు. ఈ విషయంలో జగన్ ఏ ఒక్కరి వద్ద కూడా నోరు విప్పలేదు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తన కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న సమయంలో... ఇదిగో వీరే జగన్ కేబినెట్ మంత్రులు అంటూ లెక్కలేనన్ని జాబితాలు బయటకు వచ్చాయి. ఏ ఒక్క జాబితా కూడా జగన్ అంచనాను పట్టలేకపోయింది.

ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే... ఇప్పుడు కూడా నాలుగు రాజ్యసభ స్థానాలకు జగన్ ఎవరికి కేటాయిస్తారన్న విషయంపై ఏ ఒక్కరికి జగన్ అంచనా బోధపడదనే మాట బాగా వినిపిస్తోంది. తన పార్టీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసిన జగన్.. సరైన సమయంలోనే ఆ విషయాన్ని రివీల్ చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ నోట నుంచి ఆ పేర్లు విడుదలయ్యే దాకా ఏ ఒక్కరు కూడా జగన్ అంచనాను వందకు వంద శాతం పట్టలేరన్న మాట ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇతర మీడియా సంస్థలను పక్కనపెడితే... జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి పత్రిక కూడా ఈ విషయంలో జగన్ అంచనాను పట్టేయడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో... వైసీపీకి దక్కే నాలుగు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయన్న విషయం జగన్ నోరిప్పేదాకా సస్పెన్సేనన్న మాట.
Tags:    

Similar News