ఎన్నికలు ఏపీలో చూస్తే ఏణ్ణర్ధానికి వచ్చేశాయి. వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీ ఇవ్వని హామీ అంటూ చాలా చేశామని చెబుతోంది. అయితే ఏ హామీలో లేని ఒక అతి పెద్ద విషయం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే మ్యాటర్ మాత్రం జగన్ సీఎం అయ్యాక ఆరు నెలలకు కానీ బయటపడలేదు. అదే ఏపీలో మూడు రాజధానుల ముచ్చట. అమరావతిని మూడవ వంతుకే పరిమితం చేసి ప్రాంతాల మధ్య సమన్యాయం సామాజిక సమతూల్యత, అందరికీ అభివృద్ధి ఫలాలు అన్న కాన్సెప్ట్ పెట్టి రచించిన ఈ మూడు వ్యూహం టీడీపీ మాడు పగలగొట్టేదే అని అంతా అనుకున్నారు.
అయితే వ్యూహం బాగుంది కానీ అమలే సరిగ్గా లేకపోవడంతో ఆదిలోనే అవాంతరాలు ఎన్నో వచ్చాయి. చివరికి హై కోర్టు తీర్పు అయితే అమరావతికే వచ్చింది. ఆరు నెలల పాటు మౌనంగా ఉన్న ఏపీ సర్కార్ ఇపుడు మూడు రాజధానుల విషయంలో జోరు చూపిస్తోంది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెడతారు. అదే టైం లో సుప్రీం కోర్టులో హై కోర్టు తీర్పు మీద స్టే కోసం ప్రయత్నం చేస్తారు అని వార్తలు వస్తున్నాయి.
అందుకే మంత్రి గుడివాడ అమరనాధ్ ఆరు నూరు అయినా విశాఖకు రాజధాని రావడం ఖాయమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో బిల్లు ఇలా ప్రవేశపెట్టగానే అలా విశాఖకు వచ్చి జగన్ పాలన సాగిస్తారు అని మరో కొత్త విషయాన్ని కూడా ఆయన చెప్పారు. . విజయదశమికి జగన్ క్యాంప్ ఆఫీస్ విశాఖకు మారుతుంది అన్న ప్రచారం అయితే జోరందుకుంది. ఇక విజయదశమి చూస్తే కచ్చితంగా పాతిక రోజులు ఉంది
దానికి తగినట్లుగానే గుడివాడ ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరో వైపు చూస్తే మూడు రాజధానుల బిల్లుని ఎపుడు ప్రవేశపెడతారు, అసెంబ్లీ సమావేశాలు ఎపుడు అంటే ఈ నెలాఖరులో అన్న జవాబు వస్తోంది. ఏతా వాతా తేలేది ఏంటి అంటే అమరావతి రైతుల మహా పాదయాత్ర గుంటూరు, క్రిష్ణా ఉభయ గోదావరి జిల్లాలను దాటుకుని విశాఖకు చేరక మునుపే ముఖ్యమంత్రి జగన్ ముందుగా వచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. అంటే పాదయాత్ర విశాఖలో ఎంట్రీ ఇచ్చినా జగన్ క్యాంప్ ఆఫీస్ ని దాటుకునే ముందుకు వెళ్లాలన్న మాట.
విశాఖలో పాలనా రాజధాని ఏర్పడుతుంది అన్న భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రే మొదటిగా విశాఖ వచ్చి కూర్చుంటే అమరావతి రాజధాని ముద్దు, ఏకైక రాజధాని అంటూ పాదయాత్రీకులు చేసే కార్యక్రమానికి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అన్నది చూడాలి. మొత్తానికి జగన్ విశాఖకు వచ్చే దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.