మొన్నటి ఎన్నికలకు ముందు ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తాను అధికారంలోకి వస్తే... రాజన్న రాజ్యం తెస్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల ప్రచారంలోనూ జగన్ అదే మాటను పదే పదే చెప్పారు. జగన్ మాటను జనం నమ్మారు. జగన్ పార్టీ వైసీపీకి బంపర్ మెజారిటీ ఇచ్చారు. మరి తన మాటను నమ్మి జనం తనకు ఓటేస్తే... జగన్ కూడా జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. మరొకరైతే అధికారం దక్కింది కదా...ఇక చాలనుకునేవారేమో. జగన్ అలా కాదు కదా.. ఇచ్చిన మాటను అమలు చేసే దాకా ఆగరు కదా. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. ఏపీలో రాజన్న రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇచ్చిన హామాల్లో చాలా హామీలను నెవరేర్చిన జగన్...ఇప్పుడు తన తండ్రి - దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించతలపెట్టిన రచ్చబండ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అది కూడా ఇక ఎంతమాత్రం ఆలస్యం కాకుండానే... ఫిబ్రవరి 1 నుంచే అమలు చేసే దిశగా సాగుతున్నారు.
వచ్చే నెల 1 నుంచి గ్రామాల పర్యటనకు బయలుదేరేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు - వాటి వల్ల ప్రజలకు జరిగిన లబ్ధి, ఆయా పథకాల పనితీరు, పథకాలను అమలు పరిచే అధికార యంత్రాంగం పనితీరు... ఆయా పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్న దిశగా దాదాపుగా జనం మదిలో గూడుకట్టుకుని పోయిన అన్ని విషయాలను నేరుగానే వినేందుకే జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా సమాచారం. మొత్తంగా తన తండ్రి వైఎస్సార్ రూపొందించిన రచ్చబండ పథకం మాదిరి పథకమేనన్న మాట. ఫిబ్రవరి 1 నుంచే ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన జగన్... ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను కూడా రూపొందించుకున్నట్లుగా సమాచారం.
ఇప్పుడు జగన్ ఆలోచింని మాదిరిగానే... గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా రచ్చబండ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలపై జనం ఏ మేర సంతోషంగా ఉన్నారు? జనానికి ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా? అన్న విషయాలను నేరుగా తెలుసుకునేందుకే రచ్చబండను రూపొందించుకున్న వైఎస్సార్... ఆ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించేందుకు బయలుదేరి మార్గమధ్యంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ సొంతంగా పార్టీ పెట్టడం, మొన్నటి ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టడం, ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం, తన తండ్రి కంటే మరో నాలుగు అడుగులు అన్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుండటం... తదితర కార్యక్రమాలతో ఏపీలో రాజన్న రాజ్యాన్ని జగన్ సాకారం చేశారనే చెప్పాలి. తాజాగా ఇప్పుడు వైఎస్సార్ రూపకల్పన చేసిన రచ్చబండ తరహా కార్యక్రమానికి కూడా జగన్ కూపకల్పన చేస్తుండటం, దానిని వచ్చే నెల 1 నుంచే అమలులోకి తీసుకురానుండటం నిజంగా ఆసక్తికరమే.