జగన్ పొలిటికల్ స్ట్రాటజీకి రూపం..విజయసాయి రెడ్డి!

Update: 2017-06-28 11:35 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తొలి సారి ఒక నేతను రాజ్యసభకు పంపే అవకాశం లభించినప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ అవకాశం ఎవరికి ఇస్తారు? అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలిచింది. రాజ్యసభ అవకాశం కోసం పార్టీ తరపున చాలా మందే పోటీ పడుతున్నారు. వారిలో సీనియర్లున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లున్నారు. ఇవ్వకపోతే పార్టీని వీడతారనే అంచనాలున్న వారూ ఉన్నారు. అయితే రాజ్యసభ సభ్యత్వం విషయంలో జగన్ మోహన్ రెడ్డి చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉండినారు. పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసేది విజయసాయి రెడ్డినే అనే అంశం గురించి జగన్ ముందుగానే స్పష్టతను ఇచ్చారు. చివరకు అదే నిర్ణయాన్నే అమలు పరిచారు.

అప్పుడు జగన్ పై కొంతమంది విమర్శలు చేయకపోలేదు. అసలు రాజకీయానుభవం లేని విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపడం ఏమిటి? అవతల ఆ అవకాశం దక్కలేదని మైసూరారెడ్డి లాంటి సీనియర్ పార్టీని వీడడంతో.. జగన్ నిర్ణయంపై కొంతమంది ఓవర్ గా రియాక్ట్ అయిపోయారు. అయితే.. జగన్ అలాంటి క్రిటిక్స్ కు అంతుబట్టడు, జగన్ నిర్ణయాల్లో చాలా డెప్త్ ఉంటుందనే విషయం త్వరితగతినే సామాన్యుడికి కూడా అర్థం అవుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదని ఆరోజు కొంతమంది పెదవి విరిచారు కానీ.. ఈ రోజు పరిస్థితులను చూస్తుంటే విమర్శకులదే తప్పు జగన్ నిర్ణయం రైట్ - విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపడం చాలా సబబైన విషయం అని స్పష్టం అవుతోంది. ఢిల్లీలో విజయసాయి రెడ్డి జగన్ కు తురుపుముక్కగా మారడమే దీనికి నిదర్శనం.

స్ట్రాటజీ - సబ్జెక్ట్ - నాలెడ్జ్ - కమ్యూనికేషన్ - డిగ్నిటీ.. ఇవన్నీ ఒదిగి ఉన్న టాలెంటెడ్ విజయసాయి రెడ్డి. దశాబ్దాల పాటు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి తను మల్టీ టాలెంటెడ్  అంతకు మించి వైఎస్ ఫ్యామిలీకి వినయపూర్వకమైన వ్యక్తిని అని నిరూపించుకుంటున్నారు. రాజ్యసభలో ప్రసంగాల్లో అయితేనేం, ఢిల్లీలో వ్యవహారాలను చక్కబెట్టడంలో అయితేనేం.. విజయసాయి రెడ్డి ప్రత్యేకత స్పష్టం అవుతోంది. వైకాపా తరపున వేరే ఎవరినైనా రాజ్యసభకు పంపి ఉండుంటే.. ఏమయ్యేదో కానీ, విజయసాయి రెడ్డిని ఢిల్లీకి పంపడం మాత్రం జగన్ స్ట్రాటజీక్ మూవ్ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే చేత ప్రకటించబడిన రామ్ నాథ్ కోవింద్ తో విజయసాయి రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం విదితమే. అసలు అప్పటి వరకూ కోవింద్ ఎవరో మెజారిటీ భారతీయులకు తెలీదు. తెలుగు వారు ఎప్పుడూ ఆ పేరే వినలేదు. అలాంటి వ్యక్తితో విజయసాయి రెడ్డి అప్పటికే సమావేశం అయి ఉండటం, కోవింద్ పేరు బయటకు వచ్చే సమయానికే ఆయనతో విజయసాయి రెడ్డి జరిపిన సమావేశ వివరాలు కూడా వెలుగులోకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎన్డీయేలో భాగమైన తెలుగుదేశం వారికే కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలీదు, అలాంటిది వైకాపా ఎంపీకి ఎలా తెలిసిందబ్బా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

మరి విజయసాయి రెడ్డి వేగిరం - వ్యూహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి అదొక సంఘటన మాత్రమే. కేవలం పార్టీ వ్యవహారాల విషయంలోనే గాక.. ప్రజా సమస్యలను, ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించడం ద్వారా కూడా విజయసాయి రెడ్డి ప్రత్యేకతను చాటుకున్నారు. తన పటిమతో జగన్ ఎంపిక రైట్ - జగన్ గొప్ప స్ట్రాటజిస్టే అనే విషయానికి నిరూపణగా మారిన సాయి రెడ్డి వైకాపాకు ముందు ఉపయుక్తమైన మేధావిగా - జగన్ చేతిలోని అస్త్రంగా ఉపయోగపడటం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News