జ‌గ‌న్ క‌న్నా ఎక్కువ‌నుభ‌వం..కానీ ఏం లాభం!?

Update: 2017-12-28 04:51 GMT
రొడ్డ కొట్టుడు రాజ‌కీయాల‌కు భిన్నంగా.. విలువ‌ల‌తో కూడిన పాలిటిక్స్ ను చేయాల‌ని త‌పిస్తున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరు తెలుగు త‌మ్ముళ్ల‌కు ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎన్నిక‌లు అన్నంత‌నే చేతిలో ఉన్న అధికారాన్ని ఉప‌యోగించేసి కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు పెట్టేసి.. అడ్డ‌గోలు కొనుగోలుతో నేత‌ల్ని.. ఓట‌ర్ల‌ను కొనేయ‌టం అల‌వాటుగా మారిన తెలుగు త‌మ్ముళ్ల‌కు.. అందుకు భిన్నంగా పోటీ బ‌రిలోకి దిగ‌ని ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరు ఒక ప‌ట్టాన అర్థం కావ‌టం లేదు.

బ‌లం లేని వేళ‌.. ఓట్ల‌ను నోట్ల‌తో కొనుగోలు చేయ‌టం ఇష్టం లేని వేళ‌.. బ‌రిలో నిల‌వ‌ని వైనాన్ని జీర్ణించుకోలేక ఇష్టారాజ్యంగా మాట‌లు వదులుతున్న తెలుగు త‌మ్ముళ్ల తీరు చూస్తే.. విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల తీరు వారికి ఏమాత్రం ఇష్టం ఉన్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేద‌ని చెప్పాలి.

క‌ర్నూలులో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏపీ విప‌క్షానికి బ‌లం అంతంత‌మాత్ర‌మే. అలాంటి వేళ‌.. ఏదో హ‌డావుడి కోసం బ‌రిలోకి దిగ‌టానికి మించిన త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దు. నిత్యం అంద‌రికి నీతులు చెబుతుంటే బాబు.. ఇప్పుడు క‌ర్నూలులో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట్ల కొనుగోళ్ల‌కు ఇప్ప‌టికే ప్లాన్ సెట్ చేశార‌ని చెబుతున్నారు. భారీ ఎత్తున డ‌బ్బు చేమార్పిడి చేయ‌టం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ అధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించుకోవాల‌న్న‌ది ఏపీ అధికార‌ప‌క్షం ఆలోచ‌న‌.

దీనికి భిన్న‌మైన ఆలోచ‌న‌తో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విలువ‌లు.. విశ్వ‌స‌నీయ‌త‌కు భంగం వాటిల్లే ఎలాంటి ప‌నిని చేయొద్ద‌న్న ఆలోచ‌న‌లో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. రాజ‌కీయ నాయ‌కుడు అన్న వాడు చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాలే  త‌ప్పించి.. త‌ప్పించుకోవాల‌న్న ఆలోచ‌న అస్స‌లు ఉండ‌కూడ‌ద‌న్నాడు.  ఒక‌వేళ అలాంటిదే చేస్తే.. ప‌ద‌వికి రాజీనామా చేయాలే కానీ.. పరాయి సీట్ల‌ను మ‌న సీట్లుగా పాకులాడ‌టం ఏ మాత్రం మంచిది కాద‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌.

ఇందుకు త‌గ్గ‌ట్లే ఆ మ‌ధ్య‌న టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ చ‌క్ర‌పాణిరెడ్డి త‌మ పార్టీలోకి చేర‌తాన‌ని ప్ర‌క‌టించ‌టానికి ముందే ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. మాట‌కు త‌గ్గ‌ట్లే ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత త‌మ పార్టీలోకి చేర్చుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు. అవినీతి సొమ్ముతో అంద‌రిని కొనుగోలు చేసే దారుణ‌మైన సంస్కృతికి తాను దూర‌మ‌న్నారు. ఎంపీటీసీ.. జెడ్పీటీసీలు మొదలుకొని ఎమ్మెల్యేల వ‌ర‌కూ డ‌బ్బు పెట్టి కొనేస్తున్నార‌న్న విష‌యాన్ని చెప్పారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

ప్ర‌పంచంలోని మీడియా మొత్తంతో పాటు రాష్ట్రంలోని చిన్నిపిల్లాడికి సైతం బాబు అవినీతి గురించి తెలుసంటూ జ‌గ‌న్ మండిప‌డ్డారు. క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌క‌పోవ‌టానికి స్పందించిన వైఎస్ జ‌గ‌న్మోన్ రెడ్డి.. అనైతిక రాజ‌కీయాల‌కు దిగ‌టం ఇష్టం లేక‌నే పోటీ చేయ‌టం లేద‌న్నారు.

 చంద్ర‌బాబు త‌ప్పు చేస్తున్నాడ‌ని.. అయినా అత‌న్ని ప్ర‌శ్నించాల్సిన నాలుగో స్తంభం కూడా మౌనంగా ఉండిపోతుంద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  అనైతికంగా రాజ‌కీయాలు చేయాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మే అయితే.. చ‌క్ర‌పాణి చేత అస్స‌లు ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని చెప్పే వాళ్లం కాద‌ని పేర్కొన్నారు.

జ‌గ‌న్ తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇంత ఓపెన్ గా చెప్పిన త‌ర్వాత కూడా.. విప‌క్షం పారిపోయింద‌ని.. పోటీలోకి దిగే ద‌మ్ము లేద‌న్న మాటలు ఏపీ మంత్రుల నోటి నుంచి చూస్తుంటే.. వారిలోని రాజ‌కీయ అవ‌గాహ‌న ఎంత‌న్న‌ది  ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మాట‌ల‌తో రెచ్చ‌గొట్టేలా మంత్రి ఆదిలాంట వారి మాట‌లు వింటే.. వారి దుర్మార్గం ఎలాంటిదో ఇట్టే తెలుస్తుంది.  చురుకు మాట‌ల‌తో.. అవ‌మానించేలా మాట్లాడ‌టం ద్వారా జ‌గ‌న్ బ్యాచ్ బ్యాలెన్స్ కోల్పోయేలా చేయాల‌న్న కుయుక్తి తెలుగు త‌మ్ముళ్లు క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News