జగన్‌బాబు ''జెరుసలెం'' నుంచి వచ్చేశారు

Update: 2015-06-29 05:15 GMT
ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కొన్ని విషయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చాలా స్పష్టతతో.. కచ్ఛితత్వంతో వ్యవహరిస్తుంటారు. రాజకీయ నేత కమ్‌ పారిశ్రామికవేత్త అయిన జగన్‌.. అవసరానికి అనుగుణంగా కొన్ని సందర్భాల్లో పారిశ్రామికవేత్తను బయటకు తీసే జగన్‌.. మరికొన్నిసార్లు రాజకీయ నేతను బయటకు తీస్తుంటారు.

ఫ్యామిలీతో ఫారిన్‌ టూర్‌ వెళ్లిన సందర్భంలో ఆయన పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌ అయిపోయారు. తన చుట్టూ ఏం జరుగుతున్నా పెద్ద పట్టించుకోకుండా.. జెరుసలెం.. యూరప్‌ దేశాల యాత్రను ముగించుకొని ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు.. సెక్షన్‌ 8.. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు లాంటి ఎన్నో అంశాలతో రాజకీయాలు హాట్‌..హాట్‌గా సాగుతున్నా కూల్‌గా తన ఫారిన్‌ ట్రిప్‌ను పూర్తి చేసుకొని వచ్చిన జగన్‌.. ఊళ్లో లేనప్పుడు జరిగిన పరిణామాల మీద అప్‌డేట్స్‌ కోసం నేతలతో మంతనాలు మొదలెట్టారు.

ఏ అంశాల మీద ఏ విధంగా వెళ్లాలి? పార్టీ తీరు ఎలా ఉండాలన్న అంశాల మీద చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు కేసుపై ఎక్కువగా ఫోకస్‌ చేద్దామని చెప్పిన జగన్‌.. సెక్షన్‌ 8 మీద ఆయన ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫారిన్‌ టూర్‌లో బిజీగా ఉన్న జగన్‌బాబు.. తాజా అంశాల మీద మాట్లాడటానికి ప్రిపరేషన్‌ ఏమైనా అవసరమేమో..?


Tags:    

Similar News