ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇప్పటికే రెండు జిల్లాల్లో యాత్ర పూర్తిచేసిన వైఎస్ జగన్ తాజాగా అనంతపురం జిల్లా గుత్తిలో ఆసక్తికరమైన పర్యటన సాగించారు. గతంలో వలే కేవలం ప్రజల సమస్యలు వినడం - తన అభిప్రాయాలను వెల్లడించడం కాకుండా...సామాన్యులతో మమేకం అయ్యేందుకు వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంగళవారం గుత్తిలో జగన్ ఆసక్తికరంగా ప్రజలతో ముచ్చటించారు. గుత్తిలో స్థానికులు ఇచ్చిన టీ తాగుతూ - బన్ బిస్కెట్ తింటూ వారిలో ఒక్కడిగా కలిసిపోయారు. అనంతరం గుత్తి నియోజకవర్గానికి చెందిన శనగ రైతులతో కూడా జగన్ ముచ్చటించారు.
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదివరకే ప్రకటించిన నవరత్నాలను మెరుగ్గా అమలు చేసేందుకు - ప్రజల కష్టాలు తెలుసుకుని - వారికి తోడుగా నిలిచేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో దొంగల రాజ్యం సాగుతోందని - అబద్ధాలు - మోసాలు చెప్పే నాయకుడు మనకు కావాలా అని ప్రశ్నించారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మరింత మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద మే నెలలో రూ.12,500 ఇస్తామని చెప్పారు. అంతే కాకుండా తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా జరిపిద్దామని జగన్ హామీ ఇచ్చారు.
జగన్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని - ఆరోపించారు. `మోసం చేసే వ్యక్తి - అబద్ధాలు చెప్పే వ్యక్తి మనకు అవసరమా? గత ఎన్నికల్లో కంటే మరిన్ని భారీ హామీలు ఈ సారి చెబుతారు. ప్రతి ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికి ఒక మారుతి కారు కొనిస్తానని చెబుతారు. వీటితో పని జరుగదంటే ఇదే పెద్ద మనిషి ఇంకా ఏమైనా చెబుతారు` అంటూ వైఎస్ జగన్ సెటైర్ వేశారు. చంద్రబాబు పైన తింటుంటే - గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోచేస్తున్నాయనీ - పింఛను - బియ్యం - చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఉందని ఆరోపించారు.
తమ పాలనలో జన్మభూమి కమిటీల వంటి మధ్య దళారీ వ్యవస్థ ఉండనే ఉండదని వైఎస్ జగన్ అన్నారు. ``పింఛన్ - ఆరోగ్యశ్రీ - రేషన్ కార్డు - ఇల్లు కావాలన్నా..మీరు ఎవరికి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయిస్తాం. 72 గంటల్లోనే ఇవన్నీ కూడా మీకు ఇప్పించే కార్యక్రమం చేపడుతున్నాం.. నేను చెప్పిన ప్రతి దానికి మీరు సలహాలు - సూచనలు ఇవ్వండి. మన మేనిఫెస్టో కేవలం రెండు - మూడు పేజీల మేనిఫెస్టో ఉంటుంది. అందులోని ప్రతి అంశం మీ నోటి నుంచి వచ్చిన మాటే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇవన్నీ చేసి చూపిస్తాం. చెప్పినవే కాదు..చెప్పవని కూడా చేసి చూపిస్తామని చెబుతున్నాను. మీ బిడ్డను ఆశీర్వదించండి - తోడుగా నిలవండి - పాదయాత్రలో మీ ఆలోచనలు - సూచనలు ఇవ్వండి` అని వైఎస్ జగన్ కోరారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను అంతా చూశారని పేర్కొన్న వైఎస్ జగన్ మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని అప్పుడు మనసాక్షిని అడిగి ఎలాంటి నాయకుడు కావాలో నిర్ణయం తీసుకోవాలన్నారు.