ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ సాగిన చర్చల్లో అనేక ఆసక్తికర పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి. సహజంగానే సాగే విమర్శలు, ప్రతివిమర్శలు, వాదోపవాదాలకు తోడు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం వైయస్ జగన్ ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ లాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌మీద చర్చలో చంద్రబాబు పాల్గొంటారని చాలా ఆశగా ఎదురుచూశామని, ఎక్కువ సమయంకూడా ఇచ్చాం. కాని తన ధోరణి మారదు అన్నట్టుగానే చంద్రబాబు రాలేదన్నారు. వాలంటీర్లు, సచివాలయాల ఏర్పాటుతో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు కల్పించడమన్నది దేశచరిత్రలో ఎప్పుడూ జరగలేదని సీఎం జగన్ అన్నారు. ఎక్కడైనా, ఎవరైనా పక్షపాతం చూపించినా, ఎవరైనా లంచాలు తీసుకున్నా... ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఇచ్చామని, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కనెక్ట్ అయ్యేట్టుగా చేశామని తెలిపారు. `ఎక్కడైనా సరే ఎవరైనా తప్పులు చేస్తే తొలగిస్తామని స్పష్టంగా చెప్పాం. 1902 అనే కాల్ సెంటర్‌ను కూడా పెట్టాం. ప్రతి యాభై ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీకూడా నేరుగా డోర్‌డెలివరీ చేసే విధంగా ఈవ్యవస్థను రూపొందించాం. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సెక్రటేరియట్‌ను తీసుకురావడం, ఆ 2వేల జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను గ్రామ సచివాలయం, గ్రామ సెక్రటేరియట్ కూడా ప్రతి సేవను కూడా డోర్‌డెలివరీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారునికీ మంచి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టాం`` అని జగన్ తెలిపారు.
ఎవ్వరైనా, ఎక్కడైనా మిగిలిపోతే గ్రామ సచివాలయంలో ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అతికిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ``ఆ జాబితాలో లబ్ధిదారుల జాబితాను అతికించడమే కాకుండా, ఆ జాబితా పక్కనే అర్హతలు ఏంటి, ఎవరిపేరైనా మిస్ అయితే వాళ్లు ఎలా నమోదుచేసుకోవాలి అన్న విషయాలను రాస్తున్నాం. శాశ్వతంగా సోషల్ ఆడిట్ కోసం ఇవన్నీ చేస్తున్నాం. అర్హత ఉన్నవారు మిగిలిపోకుండా ఉండడానికి, అర్హత లేకుండా పథకాన్ని పొందిఉంటే.. తొలగించడానికి ఇవన్నీచేస్తున్నాం. సోషల్‌ఆడిట్ మెకానిజాన్ని గ్రామ సచివాలయంలో అంతర్భాగంగా పెట్టాం. దాదాపు 500 రకాల సేవలను అందిస్తున్నాం. సర్టిఫికెట్‌కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా.. 72 గంటల్లో ఇస్తామా? వారంరోజుల్లో ఇస్తామా? లేకపోతే రెండు వారాల్లో ఇస్తామో స్పష్టంగా వివరణ ఇస్తూ... ఏయే సేవలు ఎన్నిరోజుల్లోగా అందిస్తామో... ప్రదర్శించమని అధికారులకు చెప్పాం. ఇంత ముఖ్యమైన విషయాల గురించి చర్చ సమయంలో...దురదృష్టవశాత్తు, చంద్రబాబు రాలేదు. రాలేకపోయినప్పటికీ ఈ ప్రసంగాన్ని ఆయన టీవీలో చూస్తూ వుంటారని అనుకుంటున్నాను ‘నాలెడ్జ్ కాస్త పెంచుకుంటాడని ఆశిస్తున్నా’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.