కాల్ మనీ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ లో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేసిన విపక్ష నేత వైఎస్ జగన్.. తన వాదనకు తోడుగా.. ఈనాడు దినపత్రికకు చెందిన కటింగ్ లను వాడుకోవటం కనిపించింది. తాను చేసే వ్యాఖ్యలకు.. ఈనాడు దినపత్రికలో అచ్చేసిన వార్తల్లోని అంశాలు చదువుతూ కనిపించారు. ఈ సందర్భంగా ‘‘మీ అధికారిక గెజిట్’’ అంటూ వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు.
కాల్ మనీ విషయానికి సంబంధించి పబ్లిష్ అయిన వార్తలకు సంబంధించి జగన్ వైఖరి చూస్తే.. ఆయన తన సొంత పత్రిక అయిన సాక్షి కంటే కూడా ఈనాడు దినపత్రికనే ఎక్కువగా చదువుతారనిపించక మానదు. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీకి వెళ్లి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావును కలిసి.. దాదాపు గంటపాటు గడిపిన జగన్.. ఆ తర్వాత ఈనాడు మీదా.. దాని యజమాని రామోజీ మీద పెద్దగా విమర్శలు చేసింది లేదు. కానీ..తాజా కాల్ మనీ ఇష్యూలో మాత్రం అందుకు భిన్నంగా.. బాబు సర్కారు మీద గురి పెట్టేందుకు ఈనాడును ప్రయోగించటం స్పష్టంగా కనిపించింది.