ఏపీలో సర్వేలు.. అంచనాలు అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేత జగన్ కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఇక పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి అమరావతికి తరలించడానికి నిర్ణయించారు.
తాజాగా సోమవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో గల పార్టీ సామగ్రి, ఇతర వస్తువులను అమరావతికి తరలించడం ప్రారంభమైంది. ఈ నెల 21 వ తేదీ వరకు అన్ని తరలించేస్తారని సమాచారం. వైసీపీ కేంద్ర కార్యాలయం అమరావతి కేంద్రంగా ఇక నుంచి పనిచేస్తుందని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక జగన్ కూడా అమరావతి నుంచే వైసీపీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
పార్టీ కార్యాలయాన్ని తరలించాక.. ఫలితాలకు ముందు రోజు ఈనెల 22వ తేదీ నుంచి అమరావతి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిసింది. 22వ తేదీన ఉండవల్లికి జగన్ వెళ్లి అక్కడ తన నివాసానికి చేరుకున్నాక కేంద్ర కార్యాలయ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని నిర్ధారించుకున్నానే జగన్ పూర్తి విశ్వాసంతో లోటస్ పాండ్ నుంచి అమరావతికి కేంద్ర కార్యాలయాన్ని తరలించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.