మండుటెండలను కూడా లెక్క చేయకుండా వైసీపీ అధ్యక్షడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జగన్....ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భీమవరంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని - స్కాములు చేయడం గురించి ఎమ్మెల్యేలకు చంద్రబాబు శిక్షణనిస్తున్నారని దుయ్యబట్టారు. భీమవరం మొత్తం టీడీపీ నాయకుల అవినీతితో కంపు కొడుతోందని విమర్శించారు. పేదల ఇంటి నిర్మాణానికిచ్చిన స్థలాలను చంద్రబాబు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఆ స్థలాలకు బదులుగా చంద్రబాబు ఇచ్చే ప్లాట్లు తీసుకోవాలని - తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్లాట్ రుణమాఫీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక ఆక్వారైతులకు న్యాయం చేస్తానని చెప్పారు.
చంద్రబాబు హయాంలో అవినీతి స్కాములు విపరీతంగా పెరిగిపోయాయని - టీడీపీ నేతలు అందినకాడికి దండుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. వీరవాసరం మండలం లో కేంద్రం మంజూరు చేసిన రక్షిత తాగునీటి ప్రాజెక్టును టీడీపీ నేతలు తుంగలో తొక్కారన్నారు. భీమవరంలో ట్రాపిక్ సమస్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్వా పుడ్ పార్కు ను సముద్రతీరానికి తరలించాలని తుందుర్రు గ్రామాల ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. అంతేకాకుండా, ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. తాను అధికారంలోకి రాగానే కచ్చితంగా అక్వా పార్క్ ను సముద్రతీరానికి తరలిస్తానన్నారు. ప్రభుత్వ ల్యాబులను చంద్రబాబు మూసి వేయిస్తున్నారని....ప్రైవేటు ఆక్వా ల్యాబులు - హేచరీలను పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఆక్వా రైతులకు 5ఏళ్ళ పాటు రూ.1.50కి కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చానని - దానిని చూసిన చంద్రబాబు ఏడాదిపాటు యూనిట్ 2 రూపాయలకు ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు ఆయన జయంతి రోజున దండేసి `మహానాడు` నిర్వహించడం హాస్యాస్పదమని జగన్ ఎద్దేవా చేశారు.