జగన్ ను మీరెప్పుడూ ఇలా చూసి ఉండరు

Update: 2017-03-18 06:13 GMT
తెలుగు ప్రజలకు సుపరిచితుడైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటకు రావు. సీరియస్ పాలిటిక్స్ తప్పించి.. కామెడీ మాటలు చెప్పటం జగన్లో అస్సలు కనిపించవు. ఆ మాటకు వస్తే.. తండ్రి మరణానికి ముందు నుంచి జగన్ ను టార్గెట్ చేస్తూ.. రాజకీయ దాడి మొదలెట్టిన విపక్షం.. తండ్రి మరణం తర్వాత సొంత పార్టీ నేతల  (కాంగ్రెస్) నుంచి ఎదురైన రాజకీయ కుట్రలతో ఆయన నిత్యం పోరాటాలు చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి.

తన మీద జరిగే రాజకీయ దాడులకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూ.. ముందుకెళ్లే జగన్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలంటే అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. చాలా అరుదుగా మాత్రమే జగన్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది.  స్కూల్ యూనిఫాంలో ఉన్న జగన్ సరికొత్తగా కనిపించటం ఖాయం.

స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఈ ఫోటో చూసినప్పుడు.. జగన్ లో హుషారుతనం..తనదైన స్టైల్ స్పష్టంగా కనిపించకమానవు.44 ఏళ్ల జగన్.. ఎంపీగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా..2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా తాజాగా బయటకు వచ్చిన జగన్ ఫోటో.. ఆయన్ను అభిమానించే వారికే కాదు.. తెలుగు ప్రజలందరిలోనూ ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతుందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News