వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అమరావతికి అతి సమీపంలో తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి పూర్తిగానే దిగేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని జగన్... తాడేపల్లి ఇంటికి మార్చేసేందుకు నిర్ణయించారు. నేడో, రేపో పూర్తి స్థాయిలో తాడేపల్లిలోని నివాసంలో పార్టీ కార్యాలయం పని చేయడం ప్రారంభించనుంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్థంలో సువిశాలంగా నిర్మించుకున్న ఈ భవంతిలో ఇంటితో పాటు పార్టీ కార్యాలయానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు ముందే ఈ కొత్త గృహంలోకి జగన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండటం - పోలింగ్ ముగిసిన తర్వాత కాస్తంత రెస్ట్ తీసుకునే క్రమంలో నిన్నటిదాకా పార్టీ కార్యాలయం తరలింపునకు సంబంధించిన చర్యలు ప్రారంభం కాలేదు. పోలింగ్ ముగిసి అప్పుడే నెల రోజులు దాటిపోవడం - మరో 9 రోజుల్లోనే ఫలితాలు కూడా రానుండటంతో జగన్ మొత్తంగా తాడేపల్లికి షిఫ్ట్ అయిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19 నుంచి జగన్ ఇక్కడే ఉండనున్నట్లుగానూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సరే... ఇదంతా బాగానే ఉన్నా... ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం దాదాపుగా ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటిదాకా వెలువడిన సర్వేలన్నీ కూడా జగన్ విక్టరీని క్లియర్‌గానే చెప్పేశాయి. ఈ లెక్కన వైసీపీ విజయం సాధించి... జగన్ సీఎం అయితే ఆయన ఎక్కడి నుంచి తన పాలనను సాగిస్తారన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఐదేళ్ల క్రితం నవ్యాంధ్ర ప్రస్థానం మొదలు కాగా... ఓ ఏడాది పాటు హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు... ఓటుకు నోటు కేసు నేపథ్యంలో అమరావతికి పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు సీఎం క్యాంపు ఆఫీస్ కు సరిపడ బిల్డింగులు ఏవీ లేని నేపథ్యంలో ఏపీ సర్కారు అక్రమ నిర్మాణంగా తేల్చేసిన లింగమనేని గెస్ట్ హౌస్ ను అప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసేసి... దానినే చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు.
మరి ఇప్పుడు జగన్ సీఎం అయితే లింగమనేని గెస్ట్ హౌస్ ను తన క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తారా? అన్న ప్రశ్న కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే అక్రమ నిర్మాణంగా ప్రభుత్వం తేల్చేసిన లింగమనేని గెస్ట్ హౌస్ లో కాలు పెట్టేందుకు జగన్ ససేమిరా అంటున్నారట. తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటినే ఆయన తన క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటారట. మొత్తంగా ఇల్లు - పార్టీ కార్యాలయం కోసం జగన్ నిర్మించుకున్న ఈ కొత్త భవనాన్ని జగన్... తాను సీఎం అయ్యాక సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటారని విశ్వసనీయ సమాచారం.