ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటిదాకా ఉన్న ఇమేజీ క్రౌడ్ పుల్లర్ మాత్రమే. అయితే అది ఇకపైనా కొనసాగినా...భవిష్యత్తులో ఆయన తనదైన పాలనతో జనాన్ని మెప్పిస్తారని చెప్పక తప్పదు. ఇందులో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే... ఎన్నికలకు ముందే జగన్ రూపొందించిన నవరత్నాలను టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి మక్కికి మక్కి కాపీ కొట్టేశారు. తన రాజకీయ ప్రత్యర్థి అని కూడా చూడకుండా చంద్రబాబే కాపీ కొట్టారంటే... నవరత్నాలను జగన్ ఎంత గొప్పగా రూపొందించారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. జగన్ అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న చంద్రబాబును తన బాటలోకి జగన్ తీసుకొచ్చారంటే... నిజంగానే ఆసక్తికరమే కదా.
విపక్ష నేత హోదాలోనే ఈ తరహాలో జనరంజక పథకాలకు రూపకల్పన చేస్తున్న జగన్... ఇక సీఎం అయితే ఆయన పాలన ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు కదా. సరే... ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ఎప్పుడో ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో ఫలితాలు కూడా రానున్నాయి. ఈ ఫలితాల్లో జగన్ పార్టీ బంపర్ మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని దాదాపుగా అన్ని సర్వేలు కోడై కూస్తున్నాయి కదా. మరి జగన్ సీఎం అయితే నవరత్నాలను మాత్రమే అమలు చేస్తారా? లేదంటే... ఇంకేమైనా కొత్త పథకాలు ప్రారంభిస్తారా? అన్న విషయంపై అప్పుడే ఆసక్తికర చర్చకు తెర లేసింది.
ఈ క్రమంలోనే తాను సీఎం అయితే ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటానని జగన్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి కదా. దేశంలోనే రూపాయి వేతనం తీసుకునే తొలి సీఎంగా జగన్ రికార్డు సృష్టిస్తే... తాము కూడా ఆయన బాటలోనే పయనిస్తామని వైసీపీ నేతలు చెప్పిన వార్తలు కూడా ఆసక్తి రేకెత్తించాయి కదా. ఈ క్రమంలో సీఎం కాకుండానే ఈ తరహాలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్... జనరంజక పాలన అందించడం ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంటే జనాన్ని జగన్ ఇంప్రెస్ చేయడం పక్కానేనన్న మాట.